అయ్యో పాపం: 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తల నరికిన సొంత అన్నలు

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. వావివరసలు మరిచి 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు మృగాళ్లు. సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధులు ఆ చిన్నారిపై అత్యాచారం చేసి తల నరికారు. అత్యచారం చేసిన వారిలో చిన్నారి మామ కూడా ఉన్నాడు.

సొంత అన్నలే బాలికపై అత్యాచారం

సొంత అన్నలే బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సాగర్ జిల్లాలో ఓ 12ఏళ్ల దళిత చిన్నారిపై సొంత అన్నలే అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై ఆమె తలను అతికిరాతకంగా నరికి బేర్‌ఖేడీ గ్రామ శివార్లలోని పంటపొలాల్లో విసిరేశారు. మార్చి 13న జరిగిన ఈ ఘటనను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఆరవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి మార్చి 13న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే మరుసటి రోజు ఆమె తల మొండెం వేర్వేరు ప్రాంతాల్లో లభించడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందించిన వారికి రూ.10వేలు బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ చిన్నారి హత్యకు సంబంధించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ఆ బహుమానాన్ని 25వేలకు పెంచారు.

పొరిగింటి వారిపై నిందను మోపే యత్నం

పొరిగింటి వారిపై నిందను మోపే యత్నం

ఇక దర్యాప్తులో భాగంగా చిన్నారి అత్తను ప్రశ్నించగా ఆమెకు నిజం తెలిసినప్పటికీ పోలీసులకు చెప్పకుండా పొరింగింటి వారిపై నేరాన్ని నెట్టేసింది. దీంతో పోలీసులు పొరిగింట్లో వారిని విచారణ చేయగా వారు చిన్నారి సోదరులను విచారణ చేయండి అంటూ చిన్న సమాచారం ఇచ్చారు. బాలిక పెద్దన్న పై కూడా పొరిగింటివారు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పెద్దన్న కనిపించకపోవడంతో 19 ఏళ్లున్న బాలిక రెండో అన్నను పోలీసులు విచారణ చేశారు. దీంతో అతను నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

 అత్యాచారం చేసి తల నరికి పొలాల్లో విసిరేసిన మృగాళ్లు

అత్యాచారం చేసి తల నరికి పొలాల్లో విసిరేసిన మృగాళ్లు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై తన పెద్దన అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో ఇద్దరు సోదరులు కూడా చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డారు. వీరిని వారిద్దామని వచ్చిన మామ కూడా చిన్నారి పై కన్నేసి తను కూడా అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటన గురించి పోలీసులకు చెబుతానని చిన్నారి బెదిరించడంతో ఆమెను హత్య చేసి తల ఒక చోట మొండెం మరోచోట పడేశారు మృగాళ్లు. ఇప్పటి వరకు కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు బాలిక పెద్దన్న కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+