13 years love: పెళ్లికి మూడు గంటల ముందు ప్రియుడు ఎస్కేప్, వేరే అమ్మాయితో, కంత్రీగాడు !

బెంగళూరు/ ఉడిపి/ మంగళూరు: ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా 13 ఏళ్లు అమ్మాయి వెంట చిత్తకార్తె కుక్కలాగా వెంటపడిన యువకుడు ఆమెను ప్రేమించాడు. 13 years love అంటూ అమ్మాయి అతనికి దాసోహం అయ్యింది. తనను గుడ్డిగా నమ్మిన ప్రియురాలిని ఆమె ప్రియుడు నిలువునా ముంచేశాడు. ప్రేమికులకు పెద్దల సమక్షంలో పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. పెళ్లికి మూడు గంటల ముందు పెళ్లి కొడుకు జెండా ఎత్తేయడంతో పెళ్లి కుమార్తె షాక్ కు గురైంది. తనను మానసికంగా, శారీరకంగా మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఇప్పుడు ఆందోళనకు దిగింది. ప్రియుడు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాయం అయిపోయాడు.

 శ్రీకృష్ణుడి పుణ్యక్షేత్రం

శ్రీకృష్ణుడి పుణ్యక్షేత్రం

కర్ణాటకలోని ఉడిపికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉడిపి శ్రీకృష్ణుడి జన్మస్థలం అని కొన్ని కోట్ల మంది భక్తులు నమ్ముతుంటారు. అలాంటి ఉడిపి జిల్లాలోని మణిపాలలో గణేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత 13 ఏళ్ల క్రితం నుంచి గణేష్ మమతా అనే యువతిని ప్రేమిస్తున్నాడు. గణేష్ చాలా కాలం పాటు నేనునిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మమతా వెనుక తిరిగాడు.

 మనను పారేసుకున్న మమతా

మనను పారేసుకున్న మమతా

తనవెంట చాలాకాలం నుంచి బుద్దిగా తిరుగుతున్న గణేష్ మీద మమతా జాలిచూపించింది. 13 ఏళ్ల క్రితం మమతా కూడా గణేష్ కు ఐలవ్ యూ చెప్పింది. అప్పటి నుంచి అందరు ప్రేమికులు లాగే గణేష్, మమతా కలిసి తిరిగారు. అయితే తనను గుడ్డిగా నమ్మిన మమతాను గణేష్ శారీరకంగా లొంగదీసున్నాడు.

 పెళ్లి చేసుకుంటాడనే ధైర్యంతో !

పెళ్లి చేసుకుంటాడనే ధైర్యంతో !

తనను ఎలాగూ పెళ్లి చేసుకుంటాడని గుడ్డిగా నమ్మిన మమతా శారీరకంగా గణేష్ కు లొంగిపోయింది. మమతా మీద కోరిక తీరిపోయే వరకు గణేష్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని గత సంవత్సరం నుంచి మమతా ప్రియుడు గణేష్ మీద ఒత్తిడి చేసింది. అయితే ఈనెల రేపు నెల అంటూ గణేష్ చాలా కాలం గడిపేశాడు.

 కట్నం కోసం వేరే అమ్మాయితో నిశ్చితార్థం

కట్నం కోసం వేరే అమ్మాయితో నిశ్చితార్థం

మమతాను పెళ్లి చేసుకోనని ఇటీవల గణేష్ ఎదురుతిరిగాడు.అయితే మమతా విషయం పెద్దలకు చెప్పడంతో వాళ్లు గణేష్ కు చివాట్లు పెట్టారు. మమతాను పెళ్లి చేసుకుంటానని, తాను ఆమెను మోసం చెయ్యనని గణేష్ పెద్దల ముందు అంగీకరించాడు. అయితే నవంబర్ 4వ తేదీన కట్నం ఎక్కువగా ఇస్తారని ఆశపడిన గణేష్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

 ప్రియుడికి పోలీసులు వార్నింగ్

ప్రియుడికి పోలీసులు వార్నింగ్

వేరే అమ్మాయితో గణేష్ నిశ్చితార్థం జరిగిందని తెలుసుకున్న మమతా తనకు న్యాయం చెయ్యాలని మణిపాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గణేష్, ఆమె కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. మమతాను మోసం చేస్తే నీకు బెండ్ తీస్తామని పోలీసులు గణేష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 పెళ్లి రోజు జెండా ఎత్తేసిన ప్రియుడు

పెళ్లి రోజు జెండా ఎత్తేసిన ప్రియుడు

పోలీసుల ముందు మమతాను పెళ్లి చేసుకుంటానని గణేస్ అంగీకరించాడు. నవంబర్ 6వ తేదీ (ఈనెల) గణేష్, మమతాల పెళ్లి చెయ్యాలని పెద్దలు అప్పటికప్పుడు నిశ్చయించారు. పెళ్లి కుమార్తె 6వ తేదీన కల్యాణమండపం చేరుకుంది. అయితే పెళ్లి కుమారుడు గణేష్ జెండా ఎత్తేశాడని కల్యాణమండపంలో ఉన్న మమతాకు సమాచారం ఇచ్చారు. గణేష్, అతని తల్లిదండ్రులు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ మమతా వారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయిన గణేష్ కోసం గాలిస్తున్నారు. 13 ఏళ్లు అమ్మాయితో తిరిగి ఎంజాయ్ చేసిన ప్రియుడు పెళ్లికి మూడు గంటల ముందు మాయం కావడం కర్ణాటకలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+