• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2022నాటికి అంతరిక్షంలో కొత్త ఇండియా: ఎర్రకోట నుంచి మోడీ 'ఆయుష్మాన్ భారత్', ఏపీ-తెలంగాణ ప్రస్తావన

By Srinivas
|

న్యూఢిల్లీ: దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ ఆయుష్మాన్ భారత్ - జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ప్రారంభించే అవకాశముంది.

15 August Independence red fort PM Narendra Modi speech live updates

Newest First Oldest First
9:11 AM, 15 Aug
ప్రధాని నరేంద్ర మోడీ చివరలో జైహింద్ అని ప్రసంగం ముగించారు.
9:10 AM, 15 Aug
మేం ఎట్టి పరిస్థితుల్లోను అభివృద్ధి విషయంలో ఆగిపోమని, ఎవరికీ తలొంచమని, అలసిపోమని మోడీ అన్నారు. మేం మా సొంత చరిత్ర రాస్తామని చెప్పారు. ఇది సరికోత్త భారత్ అన్నారు. ఆకాశాన్ని తాకి సరికొత్త ఇండియాను నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
8:51 AM, 15 Aug
త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో చారిత్రాత్మక శాంతి కనిపిస్తోందని చెప్పారు. తీవ్రవాదం 126 జిల్లాల నుంచి 90 జిల్లాలకు తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా శాంతి కోసం పని చేస్తున్నామని చెప్పారు.
8:49 AM, 15 Aug
ఇటీవల ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఓ తీర్పు చెప్పారని, అందుకు గర్వంగా ఉందన్నారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కేబినెట్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు.
8:49 AM, 15 Aug
త్రిపుల్ తలాక్ కారణంగా ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆ వర్గం మహిళలకు తాము న్యాయం చేద్దామంటే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారన్నారు. నేను ముస్లీం మహిళలకు మాటిస్తున్నానని, మీకు న్యాయం చేస్తానని చెప్పారు.
8:49 AM, 15 Aug
త్రిపుల్ తలాక్ కారణంగా ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆ వర్గం మహిళలకు తాము న్యాయం చేద్దామంటే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారన్నారు. నేను ముస్లీం మహిళలకు మాటిస్తున్నానని, మీకు న్యాయం చేస్తానని చెప్పారు.
8:48 AM, 15 Aug
మహిళలు, పురుష అధికారుల సమానత్వాన్ని ప్రస్తావించారు.
8:46 AM, 15 Aug
అత్యాచారాలు లేని భారత్‌ను నిర్మించాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఓ నిందితుడికి ఉరిశిక్ష పడిందన్నారు. ఇలాంటి వాటిని ప్రచారం చేసి, ఘోరాలను ఆపాలన్నారు. ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.
8:41 AM, 15 Aug
దేశం నీలగిరి పుష్పాల్లా వికసిస్తోందన్నారు.
8:37 AM, 15 Aug
తాను తమ పన్నును చిత్తశుద్ధితో చెల్లిస్తున్న పన్ను చెల్లింపుదారులకు ఓ విషయం చెబుతున్నానని, వారి డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఓ ట్యాక్స్ పేయర్ తాను తినేటప్పుడు తన వల్ల మరో మూడు కుటుంబాలు తన కారణంగా అన్నం తింటున్నాయని గర్వంగా ఫీల్ కావాలన్నారు. దేశం అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. వారి కారణంగా ఎంతోమంది భోజనం తింటున్నారని చెప్పారు.
8:35 AM, 15 Aug
అనారోగ్యానికి గురవుతున్న కోట్లాది మంది పేద, నిరుపేదలకు ఆసుపత్రులకు ఎంతో ఖర్చు అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకొని, వారి కోసం ఆయుష్మాన్ భవ తీసుకు వస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యాల కోసం పేదవాలు పెట్టే ఖర్చు వారిని వెనుకబడేలా చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో మోడీ ప్రారంభించిన పథకం కోట్లాది కుటుంబాలకు ఎంతో ఊరట.
8:32 AM, 15 Aug
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ దేశంలోని దాదాపు 50 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుస్తుంది.
8:28 AM, 15 Aug
ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమవుతుందని చెప్పారు.
8:27 AM, 15 Aug
మహాత్మా గాంధీ స్వచ్చ భారత్ కోరుకున్నారని, ఆయన 150వ జయంతికి భారత దేశాన్ని స్వచ్ఛంగా ఉంచితే అదే ఆయనకు అసలైన నివాళి అన్నారు.
8:26 AM, 15 Aug
ఉజ్వల, సౌభాగ్య యోజనలను ప్రధాని మోడీ ప్రస్తావించారు.
8:25 AM, 15 Aug
నేను స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినప్పుడు కొందరు నవ్వారని, తనపై సెటైర్లు వేశారని, కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంచి శానిటేషన్ కారణంగా మనం 3 లక్షల మంది జీవితాలు కాపాడినట్లు చెప్పిందన్నారు.
8:24 AM, 15 Aug
జాతిపిత మహాత్మా గాంధీ ఖాదీ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఖాదీ ఎగుమతి అవుతోందన్నారు.
8:23 AM, 15 Aug
రైతులు టెక్నాలజీని ఉపయోగించి పంటలు పండిస్తున్నారని, వారు ఇప్పుడు సోలార్ ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు.
8:20 AM, 15 Aug
2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
8:15 AM, 15 Aug
100కు పైగా శాటిలైట్లను పంపించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. మంగళ్ యాన్ పైన ఇస్రో సైంటిస్టులను ప్రశంసించారు. మన శాస్త్రవేత్తల పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నానని చెప్పారు.
8:14 AM, 15 Aug
ఇప్పుడు కేవలం పెద్ద నగరాలు మాత్రమే కాదని, 2 లేదా 3 టయర్ నగరాలు కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాయని చెప్పారు.
8:12 AM, 15 Aug
ప్రపంచ వేదికపై భారతదేశం తన యొక్క గొంతు సమర్థవంతంగా వినిపిస్తోందన్నారు.
8:10 AM, 15 Aug
గతంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఢిల్లీ తమకు దూరంగా ఉందని భావించేవారని, కానీ దేశ రాజధానిని మేం వారి వద్దకు తీసుకు వెళ్లామని చెప్పారు.
8:09 AM, 15 Aug
రికార్డులు సృష్టించే ఎకనామిక్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని భావించిన వారు, ఇప్పుడు బాగుందని భావిస్తున్నారని చెప్పారు.
8:08 AM, 15 Aug
దశాబ్దాలుగాా ఓఆర్ఓపీ డిమాండ్ ఉందని, తాము దీనిని నెరవేర్చుతామని ధైర్యవంతులైన మన సైనికులు నమ్మకం పెట్టుకున్నారని, దీంతో మేం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మేం ఎప్పుడు కూడా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
8:06 AM, 15 Aug
125 కోట్ల మంది తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మోడీ అన్నారు. 2014లో వారు భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోలేదని, ఉన్నతమైన దేశాన్ని తయారు చేయాలని భావించారన్నారు.
8:04 AM, 15 Aug
జీఎస్టీ ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉందని మోడీ చెప్పారు. గత ఏడాది జీఎస్టీ నిజమైందన్నారు. ఇది విజయవంతం కావడానికి వ్యాపారులు సహకరించారని, వారికి థ్యాంక్స్ అన్నారు.
8:02 AM, 15 Aug
ఎంఎస్‌పీ డిమాండ్ ఏళ్లుగా ఉందని మోడీ చెప్పారు. రైతులు, వ్యవసాయ నిపుణులు.. ఇలా ఎందరో రైతులకు మద్దతు ధర గురించి అడిగారని, కానీ ఇన్నాళ్లు ఏం జరగలేదన్నారు. ఇప్పుడు రైతుల ఆశీస్సులతో పెంచామని చెప్పారు.
8:01 AM, 15 Aug
ఇప్పటి వరకు మనం సాధించిన దాని పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని, అదే సమయంలో అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో చూడాలన్నారు.
7:59 AM, 15 Aug
రాజ్యాంగం రాసిన అంబేడ్కర్ అందరికీ న్యాయం కావాలని ఆకాంక్షించారనని చెప్పారు. దాని కోసం మనమంతా పని చేయాలన్నారు.
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Narendra modi speech on 15 august from Red fort. Here is the full live updates of the independence day celebration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more