Bank Holidays: ఏప్రిల్‍లో 15 రోజులు బ్యాంకులు పనిచేయవు..!
2023-2024 ఆర్థిక సంవత్సరం వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కొన్ని మార్పులు రానున్నాయి. అయితే ఏప్రిల్ లో బ్యాంకు పనులు ఉన్న వారు సెలవు దినలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వచ్చే నెలలో నేషనల్, రిజినల్ సెలవులతో కలిపి బ్యాంకులకు 15 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో ఆదివారం, రెండో, నాల్గో శనివారాలు కూడా ఉన్నాయి.
ఆర్థిక సంత్సరం అకౌంట్లు క్లోజ్ చేస్తుండడంతో ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ లో మహావీర్ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే, డా.బీఆర్. అంబేడ్కర్ జయంతి, బీజ్ పండుగ, తమిళ కొత్త సంవత్సరం, బెంగాలీ కొత్త సంవత్సరం, రంజాన్ లాంటి పండుగలు ఉన్నాయి.
బ్యాంకు సెలవులు మూడు విభాగాలుగా విభజిస్తారు. అందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే చట్టం ప్రకారం సెలవు.నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే. బ్యాంకుల ఖాతాల ముగింపు సెలవులుంటాయి. ఏప్రిల్ 1 శనివారం వార్షిక ముగింపుతో మిజోరం, చండీగఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్న రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మిజోరాం, మధ్యప్రదేశ్ మినహా చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఏప్రిల్ 15 విషు/బోహాగ్ బిహు/హిమాచల్ డే/బెంగాలీ నూతన సంవత్సర దినం (నబాబర్ష)- త్రిపుర, అస్సాం, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 18 షబ్-ల్-ఖదర్- జమ్మూ , శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు. ఏప్రిల్ 21 ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)/గరియా పూజ/జుమాత్-ఉల్-విదా- త్రిపుర, జమ్ము, కేరళలోని శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు. ఏప్రిల్ 22 రంజాన్ ఈద్ (ఈద్-ఉల్-ఫితర్), నాల్గవ శనివారం బ్యాంకులు పనిచేయవు.












Click it and Unblock the Notifications