Malware: ఆ యాప్‍లు మీ ఫోన్‍లో ఉన్నాయా.. అయితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!
మీ ఫోన్లో ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అంతే సంగతి..
మన ఫోన్ లో రకరకాల యాప్ లు ఉంటాయి. అయితే అవి ఎంత వరకు సురక్షితం చాలా మంది ఆలోచించరు. తాజాగా కొన్ని యాప్ ల వల్ల నష్టం వాటిల్లుతుందని గుర్తించారు. వీటి వల్ల బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు తెలుసుకోవచ్చటా. యాప్‌ల్లో మాల్వేర్ ఉన్నట్లు ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. అలాంటి యాప్స్ ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది. అలాగే థర్డ్ పార్టీ యాప్‌లు భద్రతా ముప్పును కలిగిస్తాయని చెబుతున్నారు.

Google Play
పరిశోధకులు తరచుగా Google Playలో మాల్వేర్-ఆధారిత అప్లికేషన్‌లను వెలికితీస్తున్నారు. ఈ యాప్‌లు మీ మొబైల్ ఫోన్‌లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకోగలవని కూడా గుర్తించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను ఉన్నాయని తెలిపింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని హెచ్చరించింది. యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ మోడల్ లాగా పని చేస్తాయని, అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు చెప్పారు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో
గూగుల్ ప్లే స్టోర్లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉందని అందుకే తక్షణమే తొలగించాలని హెచ్చరించింది. ఇవి మీ బ్యాంకు ఖాతాలో డబ్బును కొట్టేయడానికి ఉపయోగపడతాయని హెచ్చరించింది.

ఆ యాప్‍లు ఇవే
-కాల్ రికార్డర్ APK
-రూస్టర్ VPN
-సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్
-డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్
-యూనివర్సల్ సేవర్ ప్రో
-ఈగిల్ ఫోటో ఎడిటర్
-కాల్ రికార్డర్ ప్రో+
-అదనపు క్లీనర్
-క్రిప్టో యుటిల్స్
-ఫిక్స్ క్లీనర్
-యూనివర్సల్ సేవర్ ప్రో
-లక్కీ క్లీనర్
-జస్ట్ ఇన్: వీడియో మోషన్
-డాక్యుమెంట్ స్కానర్ ప్రో
-కాంకర్ డార్క్‌నెస్












Click it and Unblock the Notifications