పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ
రోజువారీ పనుల నిమిత్తం పొద్దున్నే అడవిలోకి వెళ్లిన సమీప గ్రామస్తులు అక్కడి దృశ్యాలను చూసి డంగైపోయారు. వేటగాళ్లబారినపడి చనిపోయిన ఏనుగులను చూడటం వారికి కొత్తకానప్పటికీ, తాజా దృశ్యాలు మాత్రం అందరినీ కకావికలం చేశాయి. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా పదుల కొద్దీ ఏనుగులు నిర్జీవంగా పడిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు కబురు పెట్టగా, వెటర్నరీ డాక్టర్లతోపాటు యంత్రాంగం మొత్తం అడవికి చేరుకుంది..

పిడుగుపాటు 18 ఏనుగులు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగావ్ జిల్లా అటవీ ప్రాంతంలో 18 ఏనుగులు దుర్మణం చెందాయి. ప్రతిపాదిత అభరారణ్యమైన కొండోలి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలిని పరిశీలించిన పిదప అస్సాం వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఎంకే యాదవ మీడియాతో మాట్లాడుతూ.. పిడుగుపాటు వల్లే 18 ఏనుగులూ చనిపోయినట్లు భావిస్తున్నామని చెప్పారు. పిడుగుల వల్ల ఏనుగులు మృతి చెందిన ఘటనలు గతంలో పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్నా, ఏ సందర్భంలోనూ ఒకటి రెండు కంటే ఎక్కువ ఏనుగులు ఒకేసారి చనిపోయిన దాఖలాల్లేవు.

ఇలా జరగడం ఇదే తొలిసారి..
పిడుగుల వల్ల ఒకే సారి 18 ఏనుగులు చనిపోవడం ఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతానికి వేరే కారణాలేవీ కనిపించడంలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. 2001లో స్మగ్లర్లు పెట్టిన విషాన్ని తిని 21 ఏనుగులు చనిపోవడం అస్సాం చరిత్రలో అతిపెద్ద విషాదంగా నిలిచిపోయింది. మళ్లీ అంతటి స్థాయిలో ఒకే సారి 18 ఏనుగులు పిడుగుపాటుకు చనిపోవడం కలకలం రేపింది. అయితే, ఏనుగుల మరణాలకు పిడుగులే కారణమని ఫారెస్ట్ అధికారులు భావిస్తుండగా, పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం వస్తుందోనని ఉత్కంఠగా మారింది.
Recommended Video

కొత్త సీఎం కీలక ఆదేశాలు..
నాగావ్ జిల్లాల్లో 18 ఏనుగులు చనిపోయిన ఘటనలపై అస్సాం కొత్త ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస శర్మ దిభ్రాంతి వ్యక్తం చేశారు. ఏనుగుల అనుమానాస్పద మరణాలపై దగ్గరుండి పరిశీలన చేయాల్సిందిగా అటవీశాఖ మంత్రి పరిమళ్ శుక్లా బైద్యను సీఎం ఆదేశించారు. దీంతో మంత్రి నేరుగా కొండోలి అటవీ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications