Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విదేశీ వనితపై ఖాకీల సాముహిక లైంగికదాడి.. ఇద్దరిపై కేసు

లక్నో : ఆమె విదేశీయురాలు. వీసా గడువు పొడిగించేందుకు ఓ పోలీసు అధికారిని అడిగితే .. తన శీలాన్ని అడిగాడు. అందుకు ఒప్పుకున్న ఆ మహిళ .. నరకాన్ని చవిచూసింది. ఒక్కరు కాదు .. ఇద్దరూ ఖాకీలు లైంగికంగా వేధించారు. వీసా పేరుతో లైంగికదాడి చేయడమే కాదు .. వీడియో కూడా తీసి బెదిరించడం మొదలెట్టారు. ఎలాగోలా విషయం బయటకి తెలియడంతో ఆ బాధితురాలు కీచక పోలీసుల కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురలో కిర్జికిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఉంటున్నారు. ఆమెకు హత్రాస్ సిటీకి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి మనస్సులు కలిసి .. పెళ్లి చేసుకున్నారు. వీసా గడువు పొగిడింపు విషయంలో మహిళ పడరాని పాట్లు పడ్డారు. తన వీసా గడువు పొడిగింపు కోసం ఆమె ఓ పోలీసు అధికారిని సంప్రదించారు. గడువు పొడిగింపు పేరుతో ఓ కీచక పోలీసు అధికారి సీన్‌లోకి ఎంటరయ్యాడు. ఇంతలో ఓ కీచకుడు ఎంటరై .. మాయమాటలతో మోసం చేశాడు.

2 cops gangrape foreigner, held in Mathura

ఆమెను లక్నో తీసుకెళ్లి పని పూర్తి చేస్తానని చెప్పి లైంగిక దాడి చేశాడు. దానిని వీడియో కూడా తీశాడు. అలా ఆమెను వేధించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించారు. అతనితోపాటు సహచరుడు కూడా మధురలోని హోటల్‌లో లైంగికదాడి చేశాడు. వారిద్దరి వేధింపులు తాళలేక .. ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మధుర పోలీసులు కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+