వైరల్ వీడియో: ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్..

ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. అంటూ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ మనం చూస్తుంటాం. విదేశీయులు మనదేశానికి వచ్చినప్పుడు ఇలాంటివి చూసి నోరెళ్లబెడుతుంటారు. ఇక సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్, మీమ్స్ మనకు కనిపిస్తుంటాయి. ఎక్కువగా ఫుడ్ సెక్షన్, కటింగ్ స్కిల్స్, ఫుడ్ ప్రిపేరింగ్ స్కిల్స్, బైక్ డ్రైవింగ్ స్కిల్స్ ఇలాంటి వాటికి ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను వాడుతుంటాం. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

20 Chairs on ONE Bike Polish Girl s Jaw-Dropping Reaction Goes Viral in India

పోలాండ్ నుంచి భారత్ కు వచ్చిన టూరిస్టు డామినికా పటాలాస్- కాల్రాను ఓ దృశ్యం విపరీతంగా ఆకట్టుకుంది. ఓ వ్యక్తి బైక్ పై 20 కు పైగా కుర్చీలను తీసుకెళ్తున్నాడు. ఈ దృశ్యాలను ఆమె వీడియో తీసి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటూ స్మైల్ ఈమోజీలను జత చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డోమినికా ఈ వీడియోకు క్యాప్షన్ గా ఇండియన్ జుగాడ్ అని రాసింది. అయితే జుగాడ్ అంటే క్లిష్టమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు అని అర్థం వస్తుంది. వైరల్ మీమ్స్ లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. అలాగే ఇండియాలో ఏదైనా సాథ్యమేనని వీడియోపై టెక్స్ట్ వేసింది డోమినికా.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో 20 వేల వ్యూస్ వచ్చాయి. పదుల సంఖ్యలో కుర్చీలను ఆ వ్యక్తి తన బైక్ పై తీసుకెళ్లడంపై నెటిజన్లు అతడ్ని ప్రశంసిస్తున్నారు. అయితే భారత్ లోని ఏ నగరంలో ఈ వీడియో తీశారో మాత్రం చెప్పలేదు. ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ఇండియాలో బైక్ లపై కుర్చీలు అమ్మడం కామన్ అని పేర్కొన్నాడు. టూ- వీలర్స్ మీదనే మొత్తం షాపు పెట్టేస్తారని కామెంట్ పెట్టాడు. ఇండియన్స్ మల్టీ టాలెంటెడ్ అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. యూరోపియన్స్.. వర్క్ ఎలా చేయాలో ఇండియన్స్ చూసి నేర్చుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+