ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టుల మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజాపూర్: దెబ్బకు దెబ్బతీశారు పోలీసులు. చింతగుహా ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు సిఆర్ పిఎఫ్ దళాలు. ఈ ఘటనలో సిఆర్ పి ఎప్ పోలీసులపై మావోలు పై చేయి సాధించారు.అయితే ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు పోలీసులు.

మంగళవారం మధ్యాహ్నం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రాయగఢ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారు 20 మంది మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

20 maoists killed in an encounter at Rayagada

ఈ ఘటనలో ఓ .జవాన్ కూడ చనిపోయారని ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.

ఇరువర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోలు మరణించారని పోలీసులు చెబుతున్నారు.ఈ ఎన్ కౌంటర్ లో ఛత్తీస్ ఘడ్ తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడ పాల్గొన్నట్టు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
20 maoists killed in an encounter at Rayagada forest on Tuesday.1 jawan also dead in this encounter.
Please Wait while comments are loading...