వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో కాల్‌లో దుస్తులు విప్పమన్నాడు..: యువతిని బెదిరించిన యువకుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించిన ఓ యువకుడిని ముంబై జుహు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని మజ్‌గాం ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. డీసీపీ పరంజిత్ సింగ్ దహియా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

20-year-old from Mumbai threatens woman online, held

ఓ డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత స్నాప్ చాట్ ద్వారా ఇద్దరూ చాటింగ్ చేశారని చెప్పారు. ఆమెతో చాటింగ్ చేస్తున్న క్రమంలో ఫోటోలు పంపించాలని కోరాడని, అతని దురుద్దేశం గురించి తెలియని యువతి ఫోటోలు పంపించిందని చెప్పారు.

ఇదే క్రమంలో ఓరోజు కలుద్దామని అతను ఆమెను కోరగా.. యువతి అందుకు తిరస్కరించింది. ఆపై అతన్ని స్నాప్ చాట్‌లో బ్లాక్ చేసింది. దీంతో ఫేస్‌బుక్ నుంచి మెసేజ్‌లు పంపుతూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. స్నాప్ చాట్‌లో తనను అన్ బ్లాక్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.

అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపించాడు. వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. ఆపై యువతితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. ఆమెను దుస్తులు విప్పాల్సిందిగా కోరాడు.

యువతి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు 354 D, 509,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

English summary
A 20-year-old man, who allegedly threatened 20-year-old woman from Juhu that he would circulate her morphed pictures on social media, was arrested on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X