మహారాష్ట్ర, హరియాణా సరే, 53 నియోజక వర్గాల ఉప ఎన్నికల కథ ఏమిటి, ఇదీ లెక్క !
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని 51 శాసన సభన నియోజక వర్గాలు, రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటు కోవాలని ప్రయత్నించింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ=శివసేన అధికారంలోకి వస్తున్నా హరియాణాలో మాత్రం బీజేపీ ఊహించిన మెజరాటి సాధించలేకపోయింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, ఒరిశా, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరీలో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు చివరి నిమిషం వరకూ నువ్వానేనా అంటూ పోటీ పడ్డాయి. మహారాష్ట్రలోని సతర్, బీహార్ లోని సమస్టిపుర లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

లోక్ సభ ఉప ఎన్నికల్లో గట్టి పోటీ
మహారాష్ట్రలోని సతర లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ పార్టీల అభ్యర్థులు నువ్వానేనా అంటూ పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ చివరి రౌండ్ ఫలితాలు వెలువడించే సమయానికి బీజేపీ అభ్యర్థి ఎన్సీపీ అభ్యర్థి కంటే 76 వేల మెజారిటీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీహార్ లోని సమస్టిపుర లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, లోక జన శక్తి పార్టీలు పోటీ పడుతున్నాయి.

తెలంగాణ 1, తమిళనాడు 2
తెలంగాణలోని హుజూర్ నగర్ సీటును టీఆర్ ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. హుజూర్ నగర్ నుంచి టీఆర్ ఎస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన సైదిరెడ్డి 43,284 ఓట్ల ఆధిక్యతంతో విజయం సాధించారు. తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలను అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కైవసం చేసుకుంది.

అంచనాలు తారుమారు
పుదుచ్చేరీ 1, ( కాంగ్రెస్ 1)
అరుణాచల్ ప్రదేశ్ 1, (స్వతంత్ర పార్టీ అభ్యర్థి విజయం)
మధ్యప్రదేశ్ 1, (కాంగ్రెస్ 1)
ముఘాలయ 1, (యూడీపీ 1)

ఎవరి లెక్కలు వారివే
ఒడిశా1 , (బిజేడి 1)
హిమాచల్ ప్రదేశ్ 3 (బీజేపీ 2, ఇతరులు 1)
రాజస్థాన్ 2 (కాంగ్రెస్ 1, ఇతరులు 1)
సిక్కిం 3 (బీజేపీ 1, ఇతరులు 2)

బీజేపీ, కాంగ్రెస్, జేడీయు
బీహార్ 5, (జేడీయు 2, ఆర్ జేడీ 1, ఇతరులు 2)
అస్సాం 4, (బీజేపీ 2, ఇతరులు 2)
పంజాబ్ 4, (కాంగ్రెస్ 2, ఎస్ ఎడి 1, ఇతరులు 1)

ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ
ఉత్తరప్రదేశ్ 11, (బీజేపీ 6, బీఎస్పీ 2, కాంగ్రెస్ 1, ఇతరులు 3)
గుజరాత్ 6, (బీజేపీ 3, కాంగ్రెస్ 3)
కేరళ 5, (యూడీఎఫ్ 2, ఎల్ డీఎఫ్ 2, ఇతరులు 1)
-
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications