వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించలేదని కాల్చి చంపేసిన వన్ సైడ్ లవర్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్: ప్రేమించలేదని యువతిని అతి దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇష్టం లేని వ్యక్తిని తాను ప్రేమించలేనని గట్టిగా చెప్పినందుకు ఆ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ ప్రాంతంలో ప్రదీప్ (23) అనే యువకుడు ఉంటున్నాడు. ఇతను చిన్నాచితక పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇతని ఇంటి సమీపంలోనే సుమతి (21) అనే యువతి నివాసం ఉంటోంది.

 A 21 year old girl murdered in Uttar Pradesh

సుమతిని ప్రదీప్ ప్రేమిస్తున్నాడు. అయితే సుమతికి ప్రదీప్ అంటే ఇష్టం లేదు. నిత్యం పదేపదే వెంటపడుతూ తనను ప్రేమించాలని సుమతిని వేధించేవాడు. అందుకు ఆమె నిరాకరించింది. చివరికి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని రోడ్డు మీద ఆమె గట్టిగా చెప్పింది.

ఈ విషయం జీర్ణించుకోలేని ప్రదీప్... సుమతి మీద కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి అతి సమీపం నుండి రివాల్వర్ తో సుమతి మీద కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన సుమతి సంఘటనా స్థలంలో మరణించిందని, ప్రదీప్ పరారైనాడని పోలీసులు తెలిపారు.

English summary
A 21-year-old girl murdered Bijnor area in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X