వీడో సైకో.. ప్రేమించనంటే గొంతుకోశాడు, ఫ్యామిలీ ముందే, మణికట్టు కోసుకొని..
స్నేహం, ప్రేమ కోసం చస్తారు.. లేదంటే చంపుతారు.. అందరూ కాదు కొందరే. మాట్లాడొద్దు అని చెబితే చాలు సైకోల్లా మారుతున్నారు. ఎప్పుడు ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమికుల రోజుకు ముందు దారుణ ఘటన జరిగింది. సూరత్‌లో ఓ సైకో.. యువతిని దారుణంగా హతమార్చాడు. ప్రేమించనని, మాట్లాడనని అనడమే పాపమైపోయింది. ఆమె ఫ్యామిలీ ముందే.. గొంతు కోసి తనలోని శాడిజాన్ని చూపించారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. వీడేం మనిషి అని కామెంట్లు పెడుతున్నారు.

చిన్ననాటి స్నేహితులే.. కానీ
కపొడరకు చెందిన గోయనికి.. గ్రిష్మ చిన్ననాటి స్నేహితురాలు. వారిది 22 ఏళ్ల స్నేహం.. అయితే ఏమైందో తెలియదు కానీ.. అతనితో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకోవాలని ఆమె అనుకుంది. సరిగా మాట్లాడటం కూడా లేదు. దీంతో అతను పగ పెంచుకున్నాడు. ఆమెకు ఎలాగైనా బుద్ది చెప్పాలని అనుకున్నాడు. శనివారం సాయంత్రం వారి ఇంటికి వచ్చాడు. మాట్లాడుదాం అని చెప్పి.. పసొడర శివారులోకి తీసుకెళ్లాడు. అప్పటికే వారి పేరంట్స్‌కు డౌట్ వచ్చింది. వారు కూడా వెళ్లారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంకేముంది అతనిలోని మూర్ఖుడు బయటకి వచ్చాడు. ఒక్కసారిగా పిచ్చోడు అయపోయాడు. తనతో తీసుకు వచ్చిన కత్తిని బయటకు తీశాడు.

గొంతుకోసి
ఆమెను వెనక్కి తీసుకొని.. మెడపై కత్తి పెట్టాడు. ఇంతలో యువతి ఫ్యామిలీ మెంబర్స్ వద్దు అని వేడుకుంటున్నారు. అదీ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అయినా అతను వినలేదు.. గొంతు కోశాడు. ఆమె అలా పడిపోయింది. రక్తం తీవ్రంగా కారి.. అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత అతను కూడా మణికట్టు కోసుకున్నాడు. అతనిని యువతి పేరంట్స్ పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. కళ్లముందే యువతి గాయపడి.. చనిపోవడం కలకలం రేపింది. అక్కడ ఉన్న ఓ యువకుడు గుండెలవిసేలా రోదించడం కనిపించింది.

ఇదివరకు ఫ్యామిలీ మెంబర్స్‌తో గొడవ
వారిద్దరూ.. ఒకిరికొకరు తెలుసు అని.. అయితే ఏం జరిగిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. విచారణ జరిపితే కానీ నిజ నిజాలు తెలియవు అని చెప్పారు. అయితే ఇదివరకు కూడా అతను యువతి ఇంటికి వెళ్లి వాగ్వాదం పెట్టుకున్నాడని తెలిసింది. అయితే వారి మధ్య.. ప్రేమ, పెళ్లి గురించి డిస్కష్ జరిగిందా.. లేక మరేదైనా అంశం ఉందా అనే విషయం తెలియరాలేదు. మాట్లాడకుండ ఉంటేనే దారుణానికి తెగబడ్డాడా అనే సందేహాం కలుగుతుంది. కచ్చితంగా ప్రేమ వ్యవహారం ఉందని అనేవారు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications