భర్త పనేనా?: మాజీ సీఎం కూతురుపై దుండగుల దాడి

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమార్తె లతిక దీక్షిత్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. లతిక ఉంటున్న హైలే రోడ్డులోని ఉపాసన అపార్ట్‌మెంట్స్‌లోకి ముగ్గురు దుండగులు చొరబడి దాడి చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శశికాంత్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భర్తతో మనస్పర్థలు కారణంగా లతిక కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. భర్తపై ఆమె గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు బెంగళూరులో ఉంటున్న ఇమ్రాన్‌ని అదుపులోకి తీసుకున్నారు.

3 held for attempted attack on Sheila Dikshit's daughter

లతికపై కోపంతో ఇమ్రాన్‌ మనుషులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడి ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు తెలిపారు. దాడికి ముందు లతిక ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్ద అనుమానాస్పదంగా దుండగులు తిరుగుతుండటంతో తాము పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు.

పోలీసులు అక్కడి వచ్చే లోపే దుండగులు పారిపోయారని చెప్పారు. కాగా, నవంబర్‌ 17న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుల నుంచి ఓ కారు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police have arrested three persons who were trying to attack Latika Dikshit, daughter of former Delhi Chief Minister Sheila Dikshit in her residence here, police said.
Please Wait while comments are loading...