కాశ్మీర్‌లో ఆంక్షల ఎత్తివేత: తెరుచుకున్న దుకాణాలు, పాఠశాలలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తివేశారు.
జమ్మూలో మాత్రం కొద్ది రోజుల క్రితమే ఆంక్షలు ఎత్తివేశారు. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉండటంతో ముందుగానే ఆంక్షలను ఎత్తివేశారు. తాజాగా కాశ్మీర్‌లో కూడా ఆంక్షలను ఎత్తివేశారు. ఇక్కడ కూడా సాధారణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. అక్కడ సందడి వాతావరణం కనిపించింది.

ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఇక సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు ఆంక్షలు అమలులో ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లయితే ఆంక్షలను ఎత్తివేయనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఇటీవల వచ్చిన జమ్మూకాశ్మీర్ ప్రతినిధులకు మరో 15రోజుల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంక్షలు ఎత్తివేయడం గమనార్హం.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications