వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్ క్రికెట్ బెట్టింగ్: నలుగురి అరెస్టు, ల్యాప్‌టాప్‌లు సీజ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆన్‌లైన్ ద్వారా హైటెక్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచుల సందర్భంగా మైసూరు, నంజనగూడు, హాసన్ లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు తెలిపారు.

గురువారం భారత్ -బంగ్లాదేశ్ ల మద్య క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆన్ లైన్ ద్వార క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. నంజనగూడులోని రాష్ట్రపతి రోడ్డులోని సుముఖ్ మొబైల్ షో రూం మీద పోలీసులు దాడి చేశారు.

4 people Arrested for Cricket Betting in Mysore

నిందితులు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఉపయోగించి బాల్ బాల్ కు, ప్రతి వికెట్ కు వీరు ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించి అరెస్టు చేశారు. దుబాయ్, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు తదితర నగరాలలో ఉంటున్న వారిని మొబైల్స్, ఆన్ లైన్ ద్వార సంప్రదించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

నిందితులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉపయోగించారని, వాయిస్ రికార్డర్ల ఉపయోగించి పోలీసులకు చిక్కకుండ జాగ్రత పడ్డారని మైసూరు జిల్లా ఎస్పీ అభినవ్ ఖేర్ తెలిపారు. వీరు తెలిపిన వివరాల ఆదారంగా హాసన్ లో క్రికెట్ బెట్టింగ్ కేంద్రం మీద దాడి చేశామని వివరించారు.

నిందితులు పాకిస్థాన్- ఆస్ట్రేలియా జట్ల మద్య క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి స్కెచ్ వేశారని పోలీసులు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్లహిస్తున్న అల్లూ అరుణ్, కటార్, జందూల్, మంజల్ అనే నిందితులను అరెస్టు చేసి ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, నగదు, మొబైల్ పోన్లు స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. వీరి వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని, ఆరా తీస్తున్నామని కర్ణాటక పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Mysore police have arrested 4 persons who indulged in online cricket betting in nanjangud mysore dt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X