టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగుల్లో కోత, ఏటా 60 మిలియన్ డాలర్ల ఆదా
టెక్కీలకు షాక్ ఇచ్చే వార్తే ఇది. సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉన్నాయి.
న్యూఢిల్లీ: టెక్కీలకు షాక్ ఇచ్చే వార్తే ఇది. సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. 9 నెలల వేతనంతో స్వచ్ఛంధ ఉద్యోగ విరమణకు ఈ ఉద్యోగులు అంగీకరించారని కాగ్నిజెంట్ ఆదివారం నాడు ప్రకటించింది.
కాగ్నిజెంట్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులున్నారు .స్వచ్ఛంద ఉద్యోగవిరమణ పథకానికి ఇటీవలనే కాగ్నిజెంట్ శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా స్వఛ్చందగా ఉద్యోగాన్ని వదులుకొనేవారికి 9 మాసాల వేతనాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అయితే కాగ్నిజెంట్ ప్రకటించిన ఈ స్వచ్చంద ఉద్యోగ విరమణ పథకానికి 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఎక్కువమంది భారత ఉద్యోగులేనని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ఈ ఆఫర్‌ను ఆమోదించిన భారత ఎగ్జిక్యూటివ్‌లు ఎంతమంది ఉన్నారనే విషయమై కాగ్నిజెంట్ మాత్రం వెల్లడించలేదు.వీరంతా కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోవడంతో ప్రతి ఏటా ఈ కంపెనీకి 60 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్ సీఎప్ఓ కరెన్ మెక్లీన్ ప్రకటించారు.
ఉద్యోగులపై వేటు కారణంగా కంపెనీ లాభాలు పెరిగే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సామర్థ్య మదింపు, వీఎస్‌పీ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల నిష్క్రమణ అత్యధికంగా ఉందని తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications