అమెరికా గ్రీన్ కార్డు అప్లికేషన్ల ఫ్రీజ్-భారతీయులపై 5 రకాల ప్రభావం..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై తీసుకుంటున్న చర్యలు కాస్తా ఇప్పుడు గ్రీన్ కార్డులకూ విస్తరించాయి. వలసదారులు గతంలో సక్రమంగానే తీసుకున్న గ్రీన్ కార్డులపై ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలు చేయిస్తున్న ట్రంప్.. ఇప్పుడు భారతీయులకు తాజాగా మరో షాకిచ్చారు. భారతీయులు గ్రీన్ కార్డుల కోసం చేసుకున్న 2 వేల దరఖాస్తుల్ని ఫ్రీజ్ చేయించేశారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు ట్రంప్ సర్కార్ క్లారిటీ కూడా ఇచ్చింది.
అయితే ఇప్పుడు భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఫ్రీజ్ చేయడం వల్ల మన వాళ్లపై ఐదు రకాల ప్రభావాలు పడబోతున్నాయి. వీటిలో ప్రధానంగా గ్రీన్ కార్డుల వెయిటింగ్ టైమ్ పెరకబోతోంది. అలాగే హెచ్ 1బీ వీసాదారులు గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ కూర్చొంటే వారి వర్క్ పర్మిట్లు రద్దయ్యే అవకాశముంది. భారతీయ దంపతులు లేదా జంటలు వారి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. అలాగే భారతీయ హైస్కిల్డ్ నిపుణులు గ్రీన్ కార్డులు ఆలస్యమైతే అమెరికాను కాదని కెనడా వంటి దేశాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. మరోవైపు గ్రీన్ కార్డుల ఆలస్యంతో అమెరికాకు శరణార్థులుగా వచ్చే వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారబోతోంది.

ప్రస్తుతానికి గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపేసిన ట్రంప్ సర్కార్.. తిరిగి దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియని పరిస్ధితి. దీంతో భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ తమ అవకాశాలు పోగొట్టుకోక తప్పేలా లేదు. అయితే ఇప్పటికే అమెరికాలో వీరి వలసలు సక్రమమే అని గుర్తించాక ఇంకా వెయిటింగ్ ఎందుకన్న చర్చ జరుగుతోంది.
అమెరికాలో ఉండేందుకు అన్ని అనుమతులు ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ ఆలస్యం చేయడం ఎన్నో ఇతర సమస్యలకు కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ అస్పష్ట విధానాలు భారతీయులకు తీవ్ర నష్టదాయకంగా పరిణమించడం ఖాయంగా కనిపిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications