ప్రెషర్ కుక్కర్‌లో ఇరుక్కున్న బాలుడి తల
భోపాల్: ప్రమాదశాత్తు ఓ మూడేళ్ల బాలుడి తల ప్రెషర్ కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ జిల్లా సాలిచౌక్ గ్రామంలో ఆదివారంనాడు చోటు చేసుకుంది. బాలుడు ఇంటిలోని వంటగదిలోకెళ్లి కుక్కర్‌తో ఆడుకుంటుండగా తల అందులో ఇరుక్కుపోయింది.
దీంతో అతను అరుస్తూ ఏడ్వడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలుని తండ్రి రాజ్ కుమార్ ఏమీ చేయాలో తోచక ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. వారంతా కలిసి ఎంత ప్రయత్నించినప్పటికీ తల అందులో నుంచి బయటికి రాలేదు.

చివరికి కట్టర్ సాయంతో కుక్కర్ పైభాగాన్ని కోసి బాలున్ని సురక్షితంగా కాపాడటంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. తలను బయటకు తీయడానికి పట్టిన గంటల కొద్దీ బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రసారమైంది. బాలుడు ఆదిత్య మెహ్రా నుదిటిపై గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications