50 శాతం ముస్లింలు నేరప్రవృతి కలిగినట్టు అనిపిస్తారు.. పోలీసుల వైఖరిని వెల్లడించిన ఓ సర్వే...
న్యూఢిల్లీ : ముస్లింల్లో 50 శాతం మంది నేరం చేసినట్టే కనిపిస్తారని పోలీసులు భావిస్తారని 2019 పోలిసింగ్ ఇండియా సర్వే వెల్లడించింది. ముస్లింలు, ఆయా కుటుంబ సభ్యులతో సర్వే చేసి ఈ వివరాలను తెలిపింది. సర్వే వివరాలను మంగళవారం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ విడుదల చేశారు. వీరిలో కొందరు గో వధ చేసినట్టు, మరికొందరు లైంగికదాడి చేసినట్టు కనిపిస్తారనే పేర్కొన్నారు.
ప్రతీ ఇద్దరి పోలీసుల మనస్తత్వం ఇలాగే ఉంటుందని సర్వే అంచనా వేసింది. వీరిలో దాదాపు 35 శాతం మంది గోవులను తరలించే వారని తెలిపింది. 43 శాతం మంది లైంగికదాడి, ఇతర నేరాలు చేస్తారని వెల్లడించింది. ముస్లిం కుటుంబాల్లో ఉపాధి, తదితర అంశాలపై కూడా ఎన్జీవో సంస్థలు సర్వే చేపట్టాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ .. దేశంలోని 21 రాష్ట్రాల్లో 12 వేల మంది పోలీసులను ఇంటర్వ్యూ చేసి వారి మనస్వత్వాన్ని అంచనా వేసింది. 11 వేల మంది ముస్లిం కుటుంబాల్లో పరిస్థితులను పరిశీలించి వివరాలను బహిర్గతం చేసింది.

వీరిలో 37 శాతం మంది ముస్లింలు మాత్ర చిన్న చిన్న నేరాలకు పాల్పడుతారని పోలీసులు తెలిపారని సర్వే పేర్కొన్నది. వారిని అరెస్ట్ చేసి విచారించే కన్నా .. కొన్ని కేసులు కాంప్రమైజ్ కూడా చేస్తారని గుర్తుచేసింది. అయితే మిగతా 72 శాతం పోలీసులు మాత్రం .. వివిధ కేసుల్లో రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొంటామని గుర్తుచేశారు. కేసుల్లో వారు ఎంటరవడంతో కేసు నీరుగారిపోతుందని తెలిపారు. మరోవైపు ఓ కేసును ఒక పోలీసు అధికారి కాకుండా .. పలువురు అధికారులు విచారించడం వల్ల కేసులు నీరుగారిపోతున్నాయని చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications