ఆమెకు 56, ప్రియుడికి 33: ఇద్దరు కలిసి భర్తను...
కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్య నిందితురాలిగా తేలింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు అతని ప్రియుడినీ అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
హతుడి పేరు సుబ్రహ్మణ్య. వయస్సు 60 సంవత్సరాలు. వృత్తిరీత్యా టైలర్. జిల్లాలోని కడూర్ లో భార్య మీనాక్షి, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసించే వాడు. మే 31వ తేదీన అతను అదృశ్యం అయ్యాడు. షాప్ కు వెళ్లిన తిరిగి రాలేదని మీనాక్షి.. జూన్ 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆ తర్వాత కడూర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో పట్టాలపై ఓ కాలిని పోలీసులు గుర్తించారు. అనంతరం చుట్టపక్కల అయిదు కిలోమీటర్ల దూరం వరకు గాలించగా.. మిగిలిన శరీర భాగాలు లభించాయి. సగం కాలిన స్థితిలో తల, మొండెంను స్వాధీనం చేసుకున్నారు.
ఈ శరీర భాగాలన్నీ కూడా 55 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సున్న వ్యక్తిదని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది. దీంతో మిస్సింగ్ కేసులను వెలికి తీశారు పోలీసులు. మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచినట్లుగా ఈ శరీర భాగాలు సరిపోలడంతో అది సుబ్రహ్మణ్యదిగా నిర్ధారించారు. దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ క్రమంలో సుబ్రహ్మణ్య టైలరింగ్ షాప్ వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. మే 31వ తేదీ.. అంటే అతను అదృశ్యం అయిన రోజు సాయంత్రం.. ముగ్గురు వ్యక్తులతో కలిసి అతను కారు ఎక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ, దీని ఆధారంగా వారిని ప్రదీప్, సిద్ధేష్, విశ్వాస్ గా గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. మందు పార్టీ ఉందని చెప్పి, సక్రేపట్న సమీపంలోని నిర్జన ప్రదేశంలో తీసుకెళ్లారు. మద్యం సేవించిన తర్వాత ప్రదీప్ అతని గొంతు నులిమి చంపినట్లు దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు.
దీంతో దాన్ని ముక్కలుగా నరికారు. అయిదు కిలోమీటర్ల దూరం వరకు దిక్కుకొకటి చొప్పున విసిరేశారు. ఓ వీధి కుక్క ఓ కాలును రైల్వే ట్రాక్‌ల వద్దకు లాక్కొచ్చింది. దీంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు మీనాక్షి ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. మీనాక్షి, ప్రదీప్ కాల్ డీటైల్ రికార్డ్స్‌ను పరిశీలించగా.. వారిద్దరికీ నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications