బోరుబావిలో పడిన ఆరేళ్ళ బాలిక, కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
స్నేహితులతో ఆడుకొంటూ ప్రమాదవశాత్తు ఆరేళ్ళ బాలిక బోరుబావిలో పడిపోయింది. బాలికను రక్షించేందుకు అధికారులు సహాయకచర్యలను ముమ్మరం చేశారు.
బెల్గావి: స్నేహితులతో ఆడుకొంటూ ప్రమాదవశాత్తు ఆరేళ్ళ బాలిక బోరుబావిలో పడిపోయింది. బాలికను రక్షించేందుకు అధికారులు సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. జుంజుర్వాడ్ గ్రామానికి చెందిన కావేరి అనే ఆరేళ్ళ బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకొంటోంది.

అయితే స్నేహితులతో కలిసి బోరు బావి పక్కనే ఆమె ఆడుకొంటుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలిక ఆ బోరుబావిలో పడిపోయింది. బాలికను రక్షించేందుకుగాను జాతీయ విపత్తు నిర్వహణ దళాలకు సమాచారం అందించినట్టు ఎస్పీ రవికాంత్ గౌడ తెలిపారు.
ప్రస్తుతం బాలికను కాపాడేందుకుగాను ఆక్సిజన్ ను అందిస్తున్నామని చెప్పారు. పాపను ప్రాణాలతో కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications