హాట్ కేక్‌లా మ్యాగీ: 5ని 60వేల కిట్ల అమ్మకం

ముంబై: భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారంలో మ్యాగీ నూడుల్స్ ఒకటి అనేది తప్పక ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిషేధాన్ని ఎదుర్కొని, ఆ తర్వాత నాణ్యతా ప్రమాణాల పరీక్షలో విజయం సాధించి రెండు రోజుల క్రితం మ్యాగీ నూడుల్స్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మార్కెట్లోకి వచ్చీ రాగానే మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌లో గురువారం ఉదయం మ్యాగీకి చెందిన 60 వేల వెల్‌కమ్ కిట్లను అమ్మకాల్లో ఉంచగా, కేవలం 5 నిమిషాల వ్యవధిలో అన్నీ అమ్ముడయ్యాయి.

వినియోగదారులు మ్యాగీ నూడుల్స్‌పై ఉన్న ఆపేక్షను ఈ ఆన్‌లైన్ సేల్‌లో చూపించారని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోని నావిన్ తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లకు మ్యాగీని తిరిగి చేర్చనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

60,000 Maggi WelcomeKits sold out in 5 mins; Round 2 up on Nov 16

దేశ వ్యాప్తంగా కస్టమర్లు మ్యాగీ పట్ల అసాధారణమైన స్పందన కనబర్చారని ఆయన కొనియాడారు. మ్యాగీ ద్వారా ఈ దీపావళిని వారికి ప్రత్యేకం చేసినందుకు సంతోషపడుతున్నామని అన్నారు. సరాసరిన ఒక సెకనుకు 200 మ్యాగీ కిట్లు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు.

ఈ మ్యాగీ కిట్‌లో 12 రకాల మ్యాగీ ప్యాకెట్లు, 2016 క్యాలెండర్, మ్యాగీ ఫ్రిజ్ మాగ్నెట్, పోస్టు కార్డులను ఉంచినట్టు ఆయన తెలిపారు. నవంబర్ 16 నుంచి కొత్త బ్యాచ్ మ్యాగీ వెల్‌కమ్ కిట్లను కస్టమర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

కాగా, నవంబర్ 9 నుంచి స్నాప్‌డీల్ ద్వారా ఆన్‌లైన్‌లో మ్యాగీ అమ్మకాలు దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+