అమ్మాయిపై వారంపాటు పదే పదే అత్యాచారం
న్యూఢిల్లీ: మూడేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు వారం రోజుల పాటు పదే పదే అత్యాచారం చేశాడు. పొరుగుంటి వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని అమర్ కాలనీలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది.
ఆ విషయాన్ని బాధితురాలి తల్లికి బుధవారంనాడు తెలిసిందే. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందుతుడిని బుధవారం రాత్రి ఆరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి మాస్ కమ్యూనికేషన్ సంస్థలో పనిచేస్తాడు.

బాధితురాలి కుటుంబంతో పాటు నిందితుడి కుటుంబం ఒకే భవనంలో అద్దెకు ఉంటున్నారు. ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పిగా ఉందంటూ బాలిక బుధవారం ఉదయం ఫిర్యాదు చేసింది. రెండో అంతస్థులో ఉండే అంకుల్ తనను పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ అమ్మాయి చెప్పింది.
బాలిక తల్లి తన భర్తకు విషయం చెప్పింది. ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై చాలా మార్లు లైంగిక దాడి జరిగినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్వీట్లు, చిప్స్ ఇస్తానని బుజ్జగించి తనను పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక చెప్పింది.












Click it and Unblock the Notifications