సూరత్ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, 15 మంది మృతి, పలువురికి గాయాలు

సూరత్ : గుజరాత్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కాంప్లెక్స్ కోచింగ్ సెంటరల్ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా .. కొందరు గాయపడ్డారు. బిల్డింగ్ నాలుగు అంతస్తులు ఉండగా .. మూడో ప్లోర్ లో కోచింగ్ సెంటర్ ఉంది.

హతవిధి ..

సర్తానాలో రెండో అంతస్థులో కోచింగ్ సెంటర్ ఉంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. ప్రమాదంలో 15 మంది చనిపోవడం విషాదాన్ని నింపింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నికీలలు ఎగిసిపడిన వెంటనే అక్కడే ఉన్న చిన్నారులు బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక మీడియా ప్రతినిధులు ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు కమిషనర్ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై సీఎం విజయ్ రుపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

15 killed in Surat coaching centre fire, kids jump from second floor to save lives

రంగంలోకి ఫైర్ సిబ్బంది ..
బిల్డింగ్ పైన ఎవరూ లేరని స్థానిక మీడియా పేర్కొంది. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 20ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్నాయి. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

15 killed in Surat coaching centre fire, kids jump from second floor to save lives
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+