కుంభమేళాలో 7 అద్భుతాలు.. మోనాలిసా to ఐఐటీ బాబా.. విశేషాలు ఇవే..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసింది. 45 రోజులపాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ఈ మహాకుంభమేళా కారణంగా వెలుగులోకి వచ్చిన 7 అద్భుతాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వండర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నెలకు రూ. 3లక్షల జీతాన్ని వదిలి..
ఐఐటీ బాబాగా పిలువబడే అభయ్ సింగ్.. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఆధ్యాత్మికత జీవితం వైపు అడుగులు వేశాడు. కెనడాలో నెలకు రూ. 3 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నట్లు అభయ్ సింగ్ తెలిపాడు. మహా కుంభమేళా ప్రారంభంలో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
వైరల్ గర్ల్ మోనాలిసా..
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. కానీ ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెతో ఫొటోలు దిగడం, రీల్స్ చేయడంతో మోనాలిసా ఒక్కసారిగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా రూపొందిస్తున్న ది డెయిరీ ఆఫ్ మణిపుర్ చిత్రంలో నటిస్తోంది మోనాలిసా.
భర్తకు వీడియో కాల్.. ఫోన్ కుంభమేళాలో పవిత్ర స్నానం..
మహాకుంభమేళాలో మరో అద్భుతం దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఓ మహిళ కుంభమేళాలోని త్రివేణి సంగమం నదిలో నిలబడి తన భర్తకు వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత ఫోన్ ను కూడా త్రివేణి సంగమంలో ముంచి పుణ్య స్నానం చేపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు సెలబ్రిటీ..
మహాకుంభమేళా ప్రారంభంలో బాలీవుడ్ ప్రముఖ నటి మమతా కులకర్ణి.. ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసిగా మారారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలోని కిన్నెర అఖాడాలో మాయీ మమతా నంద్ గిరి గా ఆమెకు నామకరణం చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత కిన్నెర అఖాడా నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. పలువులు మతపెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖాడాలు వెల్లడించారు.
కుంభమేళాలో హ్యారీ పాటర్..
మహాకుంభమేళాలో అచ్చం హాలీవుడ్ నటుడు హ్యారీ పాటర్ మాదిరిగా ఉన్న వ్యక్తి కనువిందు చేశాడు. ప్రయాగ్ రాజ్ లో ప్రసాదం తింటూ ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అచ్చం హ్యారీ పాటర్ లాగే ఉన్నారంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కుంభమేళాలో డిజిటల్ స్నాన్..
కుంభమేళా రాలేనివారి కోసం యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త. అదే డిజిటల్ స్నాన్. కుంభమేళాకు వెళ్లలేని భక్తులు తమ ఫొటోలను వాట్సాప్ ద్వారా అతనికి పంపించాలి. ఆ వ్యక్తి ఆ ఫొటోలను ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో వాటిని ముంచేస్తాడు. ఆ వీడియోను మీకు పంపిస్తాడు. దీంతో మీరు కూడా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించినట్లు భావించడమే డిజిటల్ స్నానం.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
92 ఏళ్ల తల్లిని కుంభమేళాకు ఎద్దుల బండిపై..
ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ 68 ఏళ్ల వ్యక్తి తన 92 ఏళ్ల తల్లి కోరికను తీర్చాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను ఎద్దుల బండిపై లాగుతూ మహా కుంభమేళాకు తీసుకెళ్లాడు. ఈ వీడియో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు ఆయన్ను ప్రశంసించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications