వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 వేల మంది చిన్నారులకు కరోనా.. థర్డ్ వేవేనా..? భయాందోళన...

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్ గజగజ వణికిస్తోంది. థర్డ్ వేవ్.. అదీ కూడా పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. దీంతో పేరంట్స్ భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ అని టాక్ వస్తోంది. కానీ మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో ఇదీ థర్డ్ వేవా అనే అనుమానాలు వస్తున్నాయి. పిల్లల గురించి ఇప్పటికే భయపడుతోన్న క్రమంలో.. ముందుగానే వైరస్ అటాక్ చేసిందా అనే అనుమానాలు సగటు పేరంట్ మెదడును తొలచివేస్తున్నాయి.

థర్డ్ వేవ్ భయం..?

థర్డ్ వేవ్ భయం..?

కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడుతున్న మహారాష్ట్రను ఇప్పుడు మరో భయం వణికిస్తోంది. రాష్ట్రంలో అహ్మద్‌నగర్ జిల్లాలో 8 వేల మందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కరోనా థర్డ్ వేవేనంటూ జనం భయపడుతున్నారు. కరోనా బారినపడిన చిన్నారులకు చికిత్స అందించేందుకకు సాంగ్లిలో ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదుగురు చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు.

8 వేల మందికి వైరస్..

8 వేల మందికి వైరస్..

మే లో 8 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని అహ్మద్‌నగర్ జిల్లా చీఫ్ రాజేంద్ర భోసలే పేర్కొన్నారు. ఆగస్టు-సెప్టెంబర్‌లో రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికలతో మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం ప్రత్యేకంగా కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లిలో ఓ వార్డు ఏర్పాటు చేసింది.

Recommended Video

PM CARES For Children: Free Education,Rs 10 Lakh Fund | Family Pension, Insurance || Oneindia Telugu
అలర్ట్.. అలర్ట్..

అలర్ట్.. అలర్ట్..

సెకండ్ వేవ్‌లో బెడ్లు, ఆక్సిజన్ వంటి వాటికి కొరత ఏర్పడిన నేపథ్యంలో థర్డ్‌వేవ్‌లో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు ఎమ్మెల్యే సంగ్రామ్ జగతప్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు, ఏ తేదీల్లో వస్తుందో తెలియదు కాబట్టి దానిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని సీఎం ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.

English summary
8000 children contract virus in maharashtra ahmednagar. is this is third wave some people feared
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X