Money Credited: కారు డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. రూ.21 వేలు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే..!

ఉన్నట్టుండి మీ బ్యాంకు ఖాతాలో రూ. 9,000 కోట్లు జమ అయితే ఏం చేస్తారు. ఆశ్చర్యపోతారు. ఇది నిజమా కాదా అని తనిఖీ చేసుకుంటారు. అది నిజమే అయితే ఎగిరిగి గంతెస్తారు. అయితే ఇది సాధ్యమా.. అంటే అవును.. ఇది నిజంగానే జరిగింది. తమిళనాడు చెన్నైలోని ఓ క్యాబ్ డ్రైవర్‌కు తన ఖాతాలో రూ.9,000 కోట్లు బ్యాంకు ద్వారా జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. తమిళనాడులోని పళనికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించిన క్యాబ్‌ డ్రైవర్‌ తన ఖాతాలో సెప్టెంబర్‌ 9న ఈ మొత్తం సొమ్ము జమ అయింది.

పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతూ ఉంటాడు. అతనికి సెప్టెంబర్ 9న సాయంత్రం ఓ మెసేజ్ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు కనిపించింది. అయితే అతను తొలుత దీన్ని ఏదైనా స్కామ్ అయి ఉంటుందని భావించాడు. అయితే నిజంగానే డబ్బులు జమ అయ్యాయా అని అతను తెలుసుకోవాలని అనుకున్నాడు. దాన్ని ధృవీకించుకోవడానికి అందులోని రూ.21 వేలను తన స్నేహితుడికి బదిలీ చేశాడు.

9 thousand crores have been deposited in the account of a car driver in Chennai

అతని స్నేహితుడికి రూ.21 వేలు వెళ్లాయి. దీంతో నిజంగానే రూ.9 వేల కోట్లు జమ ్యినట్లు తెలుకుని ఆనందంలో మునిగిపోయాడు. అతను ఆనందించేలోపే అతని ఖాతాలని మిగిలిన డబ్బులను బ్యాంక్ వెనక్కు తీసుకుంది. తూత్తుకుడిలోని మర్కంటైల్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌కుమార్‌కు అధికారులు ఫోన్‌చేసి పొరపాటున తన ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయినట్లు వివరించారు. రాజ్ కుమార్ తన స్నేహితుడికి పంపించిన రూ.21 వేలను తిరిగి చెల్లించాలని కోరారు.

చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు రాజ్‌కుమార్‌ తరఫున న్యాయవాదులు వెళ్లి రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాజ్ కుమార్ స్నేహితుడికి అతను పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని చెప్పారు. రాజ్ కుమార్ అద్దెకు తీసుకుని వాహనాన్ని నడుపుతున్నాడు. అయితే అతను వాహన కొనుగోలు చేయడానికి రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు తెలు్సతోంది. గత ఏడాది హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్‌లు తమ బ్యాంకు ఖాతాలలో ఇలానే డబ్బులు జమ అయ్యాయి. కొన్ని ఖాతాల్లో 13 కోట్ల రూపాయల వరకు జమ అయ్యాయి.

తన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందన్న భయంతో ఓ కస్టమర్ చెన్నై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ అప్‌డేట్‌లను కలిపిన సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు తప్పుగా సందేశాలు వెళ్లాయని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+