Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heart Attack: తరగతి గదిలోనే కుప్పకూలిన 12 ఏళ్ల బాలిక..

ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు గుండెపోట్లు బలిగొంటున్నాయి. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి తరగతిలో కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించలోగానే ప్రాణాలు విడిచింది. విద్యార్థిని గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలిక గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మృతురాలు రిద్ధి మేవాడ గోదాదర ప్రాంతంలో ఉన్న గీతాంజలి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రిద్ధి మొదటి బెంచీలో కూర్చుని ఉండగా.. ఆ సమయంలో ఉపాధ్యాయురాలు పాఠం చెబుతున్నారు. బాలిక ఒక్కసారిగా కుప్పకూలి, బెంచీపై నుంచి కిందపడింది. దీంతో ఉపాధ్యాయురాలు వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సెప్టెంబర్ 25 న, జామ్‌నగర్‌లోని ఒక తరగతిలో గర్బా డ్యాన్స్ స్టెప్పులు రిహార్సల్ చేస్తూ 19 ఏళ్ల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

A 12-year-old girl died of a heart attack in Gujarat

తెలుగు రాష్ట్రాల్లో కూడా గుండెపోటు మరణాలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి వయస్సు 25 ఏళ్ల లోపే ఉంది. మరో ఘటనలో ఓ వ్యక్తి హల్ది ఫంక్షన్ కు హాజరయ్యాడు. పెళ్లి కొడకుకు పసుపు రాసేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపే అతని కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొద్ది రోజుల చికిత్స అనంతరం మృతి చనిపోయాడు.

అంతకుముందు హైదరాబాద్ లాలాపేటలో ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ కిందపడిపోయాడు. అతను గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏపీ అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసి చదువుతున్న తనూజ్‌నాయక్‌ అనే 19 ఏళ్ల విద్యార్ గత మార్చి 1న కబడ్డీ ఆడుతూ కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన 17 ఏళ్ల ఫిరోజ్‌ఖాన్‌ గుండెపోతుతో మృతి చెందాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+