హెయిర్ కట్ నచ్చలేదని ప్రాణం తీసుకున్న బాలుడు
ఆత్మహత్యలు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్ద బలమైన కారణాలు కూడా అవసరం లేకుండా పోయింది. అన్ని పనుల కంటే సింపుల్ ఆత్మహత్య చేసుకోవడమే.. అన్న భావనకు వస్తున్న యువత చాలామంది పెరిగిపోయారు. తల్లి మందలించింది అని, తండ్రి అడిగింది కొనివ్వలేదని, చదువుల ఒత్తిడి తట్టుకోలేక పోతున్నామని ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎంతోమంది యువకులు, పిల్లలు, కన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు.
వారిపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు వింటేనే యువత ఆలోచన విధానం ఎందుకు ఇలా మారుతుంది.. చిన్న చిన్న పిల్లల్లో ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అన్న ఆవేదన కలుగుతుంది. తాజాగా కుటుంబ సభ్యులు తనకు నచ్చని హెయిర్ కట్ చేయించారన్న మనస్థాపంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు తనకు నచ్చిన హెయిర్ కట్ చేయించారని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బాలుడు అపార్ట్మెంట్ 16 అంతస్తు నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నాడు.

మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 13 ఏళ్ల వయసున్న బాలుడు తల్లిదండ్రులు తనకి ఇష్టం లేని హెయిర్ కట్ చేయించారని ప్రాణం తీసుకున్నాడు. ఎండాకాలం కావడంతో చిరాకుగా ఉంటుందని బాలుడికి, చిరాకు లేకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు డిప్ప కటింగ్ చేయించారు. తనకు అది నచ్చకపోతే తల్లిదండ్రులకు చెప్పాల్సింది, అలా కాకుండా తీవ్ర నిర్ణయాలను తీసుకుంటున్నారు.
దాంతో తనను అలా చూసుకోలేకపోయిన బాలుడు తల్లిదండ్రులు తనకు నచ్చని హెయిర్ కట్ చేయించారని భవనపు కిటికీ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఊహించని పరిణామానికి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం హెయిర్ కటింగ్ విషయంలో ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రాణాలు తీసుకోవటానికి వచ్చిన ధైర్యం తల్లిదండ్రులకు తన మనసులో ఉన్న భావన చెప్పటానికి లేకపోవటమే ఆలోచించాల్సిన విషయం.












Click it and Unblock the Notifications