mother: కన్న తల్లికి తుపాకితో కాల్చి చంపేసిన కొడుకు, కుర్చీలో కుర్చుని ఫోన్, తండ్రికి ముగ్గురు భార్యలు !

భోపాల్/మధ్యప్రదేశ్: తల్లీ కొడుక్కి ఒక్కనిమిషం కూడా సంతోషంగా ఉండటం లేదని తెలిసింది. తండ్రి ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కొడుకు కాలేజ్ లో చేరాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న కొడుకు, అతని తల్లి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఇంటికి వెలుతున్న తండ్రికి కొడుకు అతని తల్లి మీద ఫిర్యాదు చేస్తున్నాడు. నీ కొడుకు చెప్పినమాట వినడం లేదని భార్య ఆమె భర్తకు చెబుతోంది. తల్లికొడుక్కి తండ్రి బుద్దిమాటలు చెబుతున్నాడు. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లిన కొడుకు తల్లిని చూసి రగిలిపోయాడు. తుపాకి తీసుకుని అతని తల్లి ఛాతి మీద కాల్చి చంపేయడం కలకలం రేపింది. తల్లిని హత్య చేసిన కొడుకు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి మాఅమ్మాను కాల్చి చంపేశాను, మీరు రండి అని పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. హత్య చేసిన అబ్బాయి తండ్రికి ముగ్గురు భార్యలు ఉన్నారు.

కన్నతల్లి మీద కక్ష

కన్నతల్లి మీద కక్ష

మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో తనను తన తల్లి ప్రేమగా చూసుకోవడం లేదనే కారణంతో ఓ మైనర్ బాలుడు తన తల్లి ఛాతీపై కాల్చి చంపేశాడు. కన్నకొడుకు అతని తల్లిని హత్య చెయ్యడం మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. మైనర్ అబ్బాయి, తన తల్లి నన్ను ప్రేమించడం లేదని, నా మీద ద్వేషం పెంచుకుందని కోపంతో కన్నతల్లి ఛాతీపై తుపాకితో కాల్చి చంపాడని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. తల్లి హత్యకు గురికావడం, కొడుకు జైలుకు వెళ్లడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

తండ్రి లైసెన్స్ తుపాకి

తండ్రి లైసెన్స్ తుపాకి

మధ్యప్రదేశ్ లోని తికామ్‌గఢ్ జిల్లా దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ నగర్ కాలనీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి నివాసం ఉంటున్నాడు. ఇతని వయసు 16 ఏళ్లు. మైనర్ బాలుడి తండ్రికి లైసెన్స్‌డ్ గన్‌ ఉంది. తండ్రి లైసెన్స్ గన్ తో ఇంటర్ చదువుతున్న అబ్బాయి అతని తల్లిని కాల్చి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.

మా అమ్మతో రోజూ ఇదే పంచాయితీ

మా అమ్మతో రోజూ ఇదే పంచాయితీ

నిందితుడు అయిన మైనర్ అబ్బయిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తికమ్‌గఢ్ అదనపు ఎస్పీ సీతారాం సత్యా మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఈ మొత్తం కేసులో నిందితుడితో పాటు మృతురాలి భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. విచారణలో నిందితుడైన కొడుకు తన తల్లి తనను ప్రేమించలేదని చెప్పాడు. తల్లి నిత్యం తనతో ఏదో ఒక విషయంలో గొడవపడుతుందనే కోపంతో తల్లిని చంపేశానని చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులకు స్వయంగా ఫోన్ చేసిన నిందితుడు

పోలీసులకు స్వయంగా ఫోన్ చేసిన నిందితుడు

కన్న తల్లి మీద తుపాకితో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు అన్నారు. కన్నతల్లిని హత్య చేసిన అనంతరం నిందితుడైన కొడుకు స్వయంగా మాకు ఫోన్ చేసి విషయం చెప్పాడని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న గొడవల కారణంగా కన్న తల్లిని ఇంటర్ చదువుతున్న అబ్బాయి కాల్చి చంపేశాడని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసులు అంటున్నారు.

తండ్రి బ్యాంక్ లో ఉద్యోగి.... గన్ కు లైసెన్స్ ఉంది

తండ్రి బ్యాంక్ లో ఉద్యోగి.... గన్ కు లైసెన్స్ ఉంది

కాలేజ్ అబ్బాయి అతని తండ్రి లైసెన్స్‌డ్ గన్‌తో తల్లిని కాల్చాడని అదనపు ఎస్పీ సీతారాం సత్యా మీడియాకు చెప్పారు. పోలీసులు హత్య జరిగిన ఇంటికి వెళ్లి చూడగా తల్లిని చంపిన కొడుకు హాయిగా కుర్చీలో కూర్చున్నాడని, కన్నతల్లిని చంపినందుకు అతని ముఖంలో పశ్చాత్తాపం ఏమాత్రం కనపడటేదని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించి ఆధారాలు సేకరించామని పోలీసు అధికారులు అంటున్నారు. నిందితుడి తండ్రి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, అందుకే అతని దగ్గర లైసెన్స్ ఉన్న గన్ ఉందని పోలీసులు చెప్పారు.

తండ్రికి ముగ్గురు భార్యలు

తండ్రికి ముగ్గురు భార్యలు

బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మూడు వివాహాలు జరిగాయని పోలీసులు అన్నారు. బ్యాంక్ ఉద్యోగి మొదటి, రెండో భార్యకు పిల్లలు లేరని అతను మూడో పెళ్లి చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మూడో భార్యను అతని కుమారుడు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన మైనర్ అబ్బాయి తండ్రికి ముగ్గురు భార్యలు ఉండటంతో ఏమైనా కుటుంబ గొడవలు హత్యకు దారి తీశాయా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+