83 మందికి కుచ్చుటోపీ పెట్టిన లేడీ ఫ్యాషన్ డిజైనర్: కేరళ కుట్టి అరెస్టు, ఫేస్ బుక్ లో !

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్న ఫ్యాషన్ డిజైనర్ ను కేరళలోని కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు.

కొచ్చి: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్న ఫ్యాషన్ డిజైనర్ ను కేరళలోని కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని త్రీశూర్ కు చెందిన కృష్ణ అలియాప్ కృష్ణందు (21) అనే యువతిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు.

కృష్ణ ఓ ప్రముఖ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్ గా ఉద్యోగం చేస్తున్నది, కృష్ణ తన ఫ్రెండ్, ప్రముఖ బంగారు నగల దుకాణంలో ఉద్యోగం చేస్తున్న జీన్సన్ (27)తో కలిసి ఫేస్ బుక్ లో నిరుద్యోగులను పరిచయం చేసుకుంటున్నారు. తరువాత నిరుద్యోగులకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు.

A 21-year-old young girl was arrested by the police in Kochi

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం వస్తే సుమారు లక్ష రూపాయలు జీతం వస్తోందని నమ్మించారు. ఇలా నిరుద్యోగులను వలలో వేసుకుని ప్రతి ఒక్కరి దగ్గర రూ. 53,000 వసూలు చేశారు. చివరికి ఉద్యోగం రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు నిరుద్యోగుల ముసుగులో ఫ్యాషన్ డిజైనర్ కృష్ణను సంప్రదించారు. పోలీసులు అని తెలియకపోవడంతో కృష్ణ వారి దగ్గర రూ. 53,000 డిమాండ్ చేసింది. డబ్బులు ఇస్తాం అని నమ్మించిన పోలీసులు కృష్ణను తెలివిగా పట్టుకున్నారు.

విచారణలో పోలీసుల దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు కృష్ణ 83 మంది నిరుద్యోగులకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 45 లక్షలు వసూలు చేసిందని పోలీసులు చెప్పారు. విలాసవంతమైన జీవితం గడపడానికి ఇలా మోసం చేస్తున్నానని కృష్ణ నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+