కొడుకు కోసం తలుపు తీస్తే పక్కింటి ఆంటీని రేప్ చేశాడు: మళ్లీ వస్తా, చాన్స్ అంటూ వార్నింగ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడు విషయం బయటకు చెప్పకూడదని, తాను మళ్లీ వస్తానని, శారీరక సుఖం కోసం లైంగికంగా తనకు సహకరించాలని ఆమెను బెదిరించిన ఘటన ఢిల్లీ నగరంలోని మెహ్రోలి ప్రాంతంలో జరిగింది.

కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !

మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఓ క్రిమినల్ కేసులో జైలుకు వెళ్లిన 35 ఏళ్ల నిందితుడు ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ పక్కింటి మహిళ మీద అత్యాచారం చేశాడని మోహ్రోలి పోలీసులు చెప్పారు.

మెహ్రోలిలో మహిళ !

మెహ్రోలిలో మహిళ !

మెహ్రోలి ప్రాంతంలో 57 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఈమె కుమార్తెకు వివాహం కావడంతో ఆమె భర్తతో కలిసి ఢిల్లీలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. మహిళ మాత్రం తన కుమారుడితో కలిసి మెహ్రోలి ప్రాంతంలో నివాసం ఉంటోంది.

కుమారుడి కోసం తలుపు తీసింది !

కుమారుడి కోసం తలుపు తీసింది !

మహిళ కుమారుడు ఢిల్లీలోనే ఇంటికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి అతను బయటకు వెళ్లాడు. ఇంటికి రావడం అలస్యం అయ్యింది. ఆ సందర్బంలో ఆమె కుమారుడు వస్తాడని ఇంటి తలుపు తీసి బాల్కనీలో నిద్రపోయింది.

అదే రోడ్డులో కామాంధుడు

అదే రోడ్డులో కామాంధుడు

మహిళ నివాసం ఉంటున్న రోడ్డులోనే 35 ఏళ్ల కామాంధుడు నివాసం ఉంటున్నాడు. రాత్రి అటు వైపు వెళ్లాడు. ఇంటి తలుపు తీసి ఉన్న విషయం గుర్తించాడు. తరువాత నేరుగా ఇంటిలోపలికి వెళ్లి బాల్కనీలో ఒంటరిగా నిద్రపోతున్న మహిళను గుర్తించాడు.

రెచ్చిపోయిన కామాంధుడు !

రెచ్చిపోయిన కామాంధుడు !

మద్యం మత్తులో వెళ్లిన కామాంధుడు రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న మహిళ మీద అత్యాచారం చేశాడు. తరువాత ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.నేను అప్పుడప్పుడు వస్తానని, శారీరకంగా తనకు సహకరించి సుఖం ఇవ్వాలని ఆమెను హెచ్చరించాడు.

 భయంతో చెప్పలేదు !

భయంతో చెప్పలేదు !

అసలే జైలు చుట్టూ తిరుగుతున్న నిందితుడు ఎక్కడ తనను చంపేస్తాడో అంటూ ఆమె భయపడి తన కుమారుడికి విషయం చెప్పలేదు. అయితే కామాంధుడు మళ్లీ వచ్చి ఎక్కడ తన కోరిక తీర్చమని వేదిస్తాడో అనే భయంతో తన కుమార్తె దగ్గరకు వెళ్లింది. కుమార్తె సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కామాంధుడి కోసం ఆరా తీస్తే ?

కామాంధుడి కోసం ఆరా తీస్తే ?

57 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడి కోసం పోలీసులు ఆరా తీశారు. అతను ఇంటి పరిసర ప్రాంతాల్లో లేడని తెలుసుకున్నారు. చివరికి ఢిల్లీలోని పౌల్ ప్రహ్లాద్ ప్రాంతంలో తలదాచుకున్నాడని గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఎన్ జీవోల సహాయంతో !

ఎన్ జీవోల సహాయంతో !

కామాంధుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని, నిందితుడిని రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని పోలీసులు చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించి ఎన్ జీవోల సహకారంతో రక్షణ కల్పించామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 57-year-old widow was allegedly raped by her neighbour who barged into her shanty in an inebriated condition in south Delhi's Mehrauli,
Please Wait while comments are loading...