10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయి లవ్ స్టోరీ, గొంతు కోసే వరకు కథ వెళ్లింది !
మారుతున్న కాలంలో ఏ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడుతున్నారు అని అంచనా వెయ్యడం చాల కష్టం. స్కూల్ వయసులోనే ప్రేమ, పెళ్లి అంటూ కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అమ్మాయిల ఆకర్షణతో అది ప్రేమ అని అనుకుంటున్న కొందరు అబ్బాయిలు ప్రేమించడానికి నిరాకరించిన అమ్మాయిలను చంపడానికి సిద్దం అవుతున్నారు.
ప్రేమించడానికి నిరాకరించిన మైనర్ అమ్మాయిపై ఓ బాలుడు సినిమా తరహాలో కత్తితో పొడిచిన ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. ప్రేమించడానికి నిరాకరించిందనే కారణంతో బాలిక గొంతు కోసి ఆమెను హత్య చేసేందుకు బాలుడు అనేక ప్రయత్నాలు చేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న మైనర్ అమ్మాయిని ఇద్దరు మైనర్ బాలురు పట్టుకుని ఆ అమ్మాయిని బలవంతంగా బస్సులో నుంచి కిందకు లాగేసి తరువాత కత్తితో పొడిచారు.

కలబురగి జిల్లా అట్టూర క్రాస్ సమీపంలో బైక్‌పై వచ్చిన బాలురు మైనర్ అమ్మాయి స్కూల్ దగ్గరకు ప్రయాణిస్తున్న బస్సును ఆపమని చెప్పారు. అయితే బస్సు డ్రైవర్ బస్సు నిలపకుండా కొద్దిదూరం వెళ్లాడు. అదే బస్సును బైక్ లో వెంబడించిన అబ్బాయిలు తరువాత రోడ్డుకు అడ్డంగా బైక్ నిలిపేశారు. తరువాత డ్రైవర్ బస్సు నిలిపేశాడు. తరువాత బస్సులో ఉన్న అమ్మాయిని కిందకు దించి ఆమె గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు.
9వ తరగతి చదువుతున్న విద్యార్థి అదే స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. విద్యార్థిని ప్రేమకు నిరాకరించింది. తనను ప్రేమించలేదని 9వ తరగతి చదువుతున్న అబ్బాయి రగిలిపోయాడు. ఇదే విషయంలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని కత్తితో పొడిచి ఆమె గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు అన్నారు.
పాఠశాలకు వెళ్తున్న 10వ తరగతి బాలిక గొంతు కోసం ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన 9వ తరగతి అబ్బాయి తరువాత ఏమీ పట్టనట్లుగా పాఠశాలకు వెళ్లాడు. తనకంటే ఒక క్లాస్ ఎక్కువ చదువుతున్న అమ్మాయిని 9వ తరగతి చదువతున్న అబ్బాయి ప్రేమించాడు. ఐ లవ్ యూ అంటూ 10వ తరగతి అమ్మాయి వెంట కొంతకాలంగా తిరుగుతున్నాడు. అయితే 10వ తరగతి అమ్మాయి మాత్రం నువ్వు నాకంటే చిన్నవాడివి, నేను నిన్ను ప్రేమించలేనని, తాను పై చదువులు చదువుకోవాలని చెప్పింది.

తెలిసి తెలియని వయసులో హీరోలాగా ఫీలైన 9వ తరగతి అబ్బాయి చివరికి అతను ప్రేమిస్తున్న అమ్మాయిని హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కర్ణాటకలో కలకలం రేపింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చేరింది. అమ్మాయిని హత్య చెయ్యడానికి ప్రయత్నించి తరువాత స్కూల్ కు వెళ్లిన పిచ్చి ప్రేమికుడిని విచారణ నిమిత్తం పోలీసులు అతను చదువుతున్న తరగతి గది నుంచి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications