ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వనందుకు హత్య...!

అక్టోబర్ రెండు నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిషేధంపై సరైన అవగాహన లేని ఓ వినియోదారుడు తనకు ఎప్పటిలాగే బేకరీలో కొన్న వాటికి ప్లాస్టిక్ కవర్ ఇవ్వకపోవంతో బేకరీలో పని చేసే కార్మికుడిపై ఇటుకతో దాడి చేశాడు. విపరీతమైన గాయంలో కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిబంధనలు, వినియోగదారులకు తెలియక పోవడంతో దారుణం చేసుకోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్లాస్టిక్ కవర్ ఇవ్వనందుకు ఓ వినియోగదారుడు విచిత్రంగా వ్యవహరించాడు. అక్టోబర్ 15న ఫైజాన్ ఖాన్ అనే యువకుడు బేకరీకి వచ్చి పలు వస్తువులను కొనుగోలు చేశాడు. దీంతో అవి తీసుకెళ్లేందుకు ఎలాంటీ బ్యాగు తీసుకురాకపోవడంతో ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వాలని అందులో పనిచేసే అహ్మద్‌ని అడిగాడు. దీంతో ఖలీద్ అహ్మద్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించిన విషయాన్ని చెప్పాడు. దీంతో వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈనేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది.

a bakery shop worker killed for plastic bag

దీంతో కోపోద్రిక్తుడైన వినియోగదారుడు అక్కడే ఉన్న ఇటుకతో ఖలీల్ తలపై మోదాడు. దీంతో 45 సంవత్సరాల మధ్యవయస్కుడైన ఖలీల్ ఆహ్మద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖలీల్ మృతి చెందాడు. కాగా సంఘటనకు భాద్యుడైన యువకుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+