సినిమా థియేటర్ లో ఆ పని చేసిన బెంగళూరు అమ్మాయి..
ఐటీ రంగంలో వర్క్ కల్చర్ అనేది ఎంత కఠినంగా ఉంటుందో తెలియజేసే ఉదంతం ఇది. బెంగళూరులో ఓ మహిళా టెక్కీ.. సినిమా థియేటర్‌లో కూడా ఆఫీస్ కార్యకలాపాలను నిర్వహిస్తూ కనిపించారు. థియేటర్ కు కూడా ల్యాప్‌టాప్ వెంట తెచ్చుకుని అక్కడి నుంచే పనిచేశారు. ఓ వైపు సినిమా చూస్తూ.. మరో వైపు ఆఫీస్ పనిలో తలమునలు అయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ రెండున్నర గంటల పాటు సినిమా చూసే తీరిక కూడా టెక్కీలకు దొరకట్లేదని ఆమె ఆవేదన చెందారు.
ఓన్లీ ఇన్ బెంగళూరు. లోకా సినిమా చూడటానికి వెళ్ళాను. ఫ్రంట్ లైన్ లో ఉన్న ఓ మహిళ టెక్కీ ల్యాప్‌టాప్ తెరిచి, ఆఫీసు పనిలో నిమగ్నం అయ్యారు. ఆఫీస్ నుంచి వచ్చే మెయిల్స్ చూస్తూ, టెన్షన్ తో టైప్ చేస్తూ కనిపించింది.. అని ఓ యూజర్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. ఈ సంఘటన- బెంగళూరులో వర్క్ కల్చర్ ఎంత గందరగోళం, ఆందోళనకరంగా ఉందో ప్రత్యక్షంగా పరిచయం చేసిందని ఆ యూజర్ పేర్కొన్నాడు.

ఐటీ ఉద్యోగులు ఓ రెండు గంటల పాటు కూడా ఆఫీసు ఒత్తిడి లేకుండా ఉండలేకపోతున్నారు. వర్క్ లైఫ్ అండ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? అని నెటిజన్లను ప్రశ్నించాడు. ఈ పోస్ట్ వైరల్ అయింది. సోషల్ మీడియా యూజర్లు వేల సంఖ్యలో రిప్లైలు ఇచ్చారీ పోస్ట్ కు. ఐటీ, కార్పొరేట్ రంగంపై విస్తృతంగా డిబేట్ సాంగింది ఇందులో. ఆ లేడీ ఎంప్లాయ్.. ఆఫీస్ కు డుమ్మా కొట్టి ఉండొచ్చని కొందరు యూజర్లు కామెంట్స్ చేయగా.. ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అమెరికన్ టీమ్‌తో పనిచేస్తున్నట్లుందని, అక్కడి పని వేళలు.- ఇక్కడి సమయంతో చాలా తేడా ఉన్నందున ఇలా పొద్దుపోయాక సినిమా థియేటర్ లో కూడా ఆఫీస్ పని చేస్తుండొచ్చని మరికొందరు యూజర్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. ఆమె ఆఫీస్ వర్క్ నుంచి తప్పించుకోలేదని, సినిమా థియేటర్ లో కూడా పని చేయించుకుంటోన్న ఆ లేడీ టెక్కీ టీమ్ మేనేజర్ ఎంత కఠినంగా ఉంటాడో ఊహించుకోవచ్చని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను గొప్పగా చెప్పుకునే పెద్ద కంపెనీలు కూడా తమ పని వేళల నుంచి కొంత వెసలుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలా కనీస రెస్ట్ ఇవ్వకుండా పని చేయించుకోవడం వల్ల తలెత్తే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని టెక్ కంపెనీలు జవాబుదారీతనం పేరుతో ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నాయని మరికొందరు పేర్కొన్నారు. తాను సెలవుల్లో కూడా ల్యాప్‌టాప్ తీసుకెళ్ళేవాడినని మరో యూజర్ తెలిపాడు.
-
కర్ణాటకలో అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యం -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications