సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు పితామహుడు !
బెంగళూరు: లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవడం ఓ సమస్య అయితే అంతకంటే ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. సహజీవనం చేస్తున్న వారిలో గొడవలు ఎక్కువ కావడంతో ప్రతినిత్యం అనేక కేసులు నమోదవుతున్నాయి. అనేక ఇతర కేసులు పోలీస్ స్టేషన్‌కు చేరేలోపు వేరే మలుపు తిరుగుతాయి. ఇప్పుడు బెంగళూరులో (Bengaluru) సహజీవనం చేస్తున్న వాళ్లు పెట్టుకుంటున్న కేసులు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.
బెంగళూరులో (Bengaluru) కొన్నేళ్లుగా తనతో కలిసి సహజీవనం చేస్తున్న ప్రియురాలి (girlfriend) ఫొటోలను ఎడిట్ చేసి, వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకర చిత్రాలుగా తయారు చేశాడు. అనంతరం ఆ ఫోటోలను ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి బాధితురాలితో సహజీవనం చేస్తున్న శాడిస్టు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు (vellore) నగరానికి (చిత్తూరు (chittoor) సమీపంలోని ఊరు) చెందిన సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్ బెంగళూరులో (Bengaluru) ఉద్యోగం చేస్తున్నాడు. అదే వేలూరుకు చెందిన 24 ఏళ్ల యువతి చాలా కాలం నుంచి సంజయ్ కి పరిచయం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆ యువతి (girlfriend), సంజయ్ ప్రేమించుకున్నారు. బెంగళూరు (Bengaluru) చేరుకున్న యువతిని తన ఇంట్లోనే పెట్టుకున్న సంజయ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.
వేలూరు (vellore) అమ్మాయితో(girlfriend) సంజయ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇద్దరూ చదువుకునే రోజుల నుంచి ఒకరికొకరు పరిచయం కావడంతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ చాలా కాలం నుంచి సజవుగా సాగిపోయింది. కానీ సంజయ్ కుమార్‌కి ఓ అలవాటు ఉంది. సోషల్ మీడియాలో (social media) ఫోటోలు, వీడియోలపై ఉంటున్న వింతవింత వ్యాఖ్యలు, సెక్స్ జోకులు చదివి ఆనందించే చెడు అలవాటు ఉందని వెలుగు చూసింది.
లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ (girlfriend)మీద శాడిస్టు సంజయ్ కన్నుపడింది. రానురాను సెక్స్ జోకులు, సెక్స్ బొమ్మలు చూసే అలవాటు ఎక్కువ కావడంతో ఇంట్లో తనతో పాటు సహజీవనం చేస్తున్న యువతి ఫొటోలు రహస్యంగా తీసిన సంజయ్ వాటిని మార్ఫింగ్ చేశాడు. ప్రియురాలికి (girlfriend)తెలీకుండా ఆమె ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, వాటిని ఇతర అశ్లీల చిత్రాలతో కలిసి ఎడిటింగ్ చేశాడు.

తరువాత సంజయ్ అతను సహజీవనం చేస్తున్న యువతి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌తో సహా అనేక సోషల్ మీడియాలో (social media) షేర్ చేశాడు. ఈ ఫోటోలపై వచ్చిన కామెంట్ లను చదివుతున్న సంజయ్ చాలా సంతోషించాడు. తాను ఎంజాయ్ చేస్తున్న అమ్మాయి (girlfriend) శరీరంలోని భాగాలను ఇతరులు కామెంట్ చేస్తుంటే శాడిస్టులాగా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపాడు.
సహజీవనం చేస్తున్న ప్రియురాలికి తెలియకుండానే సంజయ్ ఇంత చేశాడు. యువతి (lady) అశ్లీల ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆమె స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు వాటిని చూసి షాక్ అయ్యారు. తరువాత యువతికి ఫోన్ చేసి ఏం జరుగుతోంది ?, నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు అంటూ ఆమెను విచారించారు. నీ అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి (social media) ఎలా వచ్చాయి అంటూ కుటుంబ సభ్యులు ఆ యువతిని నిలదీశారు.

అసలు విషయం తెలుసుకున్న యువతి హడలిపోయింది, తన అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో (social media) చూసిన యువతి ఆందోళన చెంది వెంటనే ప్రియుడు సంజయ్ కి సమాచారం అందించింది. అయితే ఈ పని తానే చేసినా ఎలాంటి ఫీలింగ్ లేకుండా చాలా లైట్ గా తీసుకున్నాడు. ప్రియులు (girlfriend) ఆందోళన చెందుతుంటే ఆమెకు కొన్ని కుంటిసాకులు చెబుతున్న సంజయ్ కాలం గడిపేశాడు.
సోషల్ మీడియాలో (social media) ఫోటోలు విపరీతంగా వైరల్ కావడం, ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా కామెంట్ లు ఎక్కువ కావడంతో హడలిపోయిన సంజయ్ ప్రియురాలు బెంగళూరులోని (Bengaluru) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బెంగళూరుపోలీసులు వివిద కోణాల్లో విచారించగా దిమ్మతిరిగిపోయే సమాచారం వెలుగులోకి వచ్చింది. యువతితో సహజీవనం చేస్తున్న సంజయ్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.
నిందితుడు సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు సంజయ్ కుమార్‌ను పెళ్లి చేసుకుంటానని అతని ప్రియురాలు (girlfriend) ఇటీవల ఆమె కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందని, అయితే సంజయ్ కి మరో యువతితో (girlfriend)అక్రమ సంబంధం ఉండటంతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని దూరం చేసుకోవడానికి ఇలాంటి పాడుపని చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. సంజయ్ ఇంకా ఇలాగే ఎవరిననా మోసం చేశాడా ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు (Bengaluru) పోలీసు అధికారులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications