హ్యాండ్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్, ప్రియురాలిని చంపడానికి మూడు కత్తులు ఎందుకు !
గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న ఓ అమ్మాయి ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. ప్రియురాలు మోసం చేసిందని బాధతో ప్రియుడు ఆమెను రద్దీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. ప్రేమిస్తున్న యువతిని రద్దీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లిన పిచ్చి ప్రేమికుడు ఆమెను కత్తితో కసకసా పొడిచేశాడు.
ఇద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో గొడవపడి ప్రియురాలి కడుపులో కత్తితో పొడిచాడు. శివమొగ్గ నగరంలోని శివప్ప నాయక్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలిని ఓ ప్రేమికుడు కత్తితో పొడిచాడని పోలీసులు అన్నారు. ఓ యువకుడు, యువతి మధ్య గొడవ మొదలైంది. ఈ సమయంలో సహనం కోల్పోయిన యువకుడు ముందుగా వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని అతని ప్రియురాలిని పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు.

శివమొగ్గ తాలూకాలోని హడోనహళ్లి గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చాలా సంవత్సరాలుకుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. చేతన్ అనే యువకుడు శివమొగ్గ సిటీలోని ఆటో కాంప్లెక్స్‌లోని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. యువతిని కత్తితో పొడిచి పారిపోతుండగా స్థానిక ప్రజలు వెంబడించి నిందితుడు చేతన్‌ను పట్టుకుని చితకబాది తరువాత అతన్ని పోలీసులకు అప్పగించారు.
కత్తితో గాయపడిన అంబిక అనే యువతి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ప్రజల చితకబాదడంతో తీవ్రగాయాలైన చేతన్ ను శివమొగ్గ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చేతన్, అంబిక గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది కాలంగా మా మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇటీవల తన ప్రియురాలు అంబికాకు వేరే పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారని ప్రియుడు చేతన్ పోలీసులకు చెప్పాడు.

తన ప్రియురాలు అంబికాను దక్కించుకోవడానికి తాను అనేక ప్రయత్నాలు చేశానని, అయితే అంబికా మాత్రం తనను మోసం చేసి వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యిందని చేతన్ పోలీసులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలు అంబికాను హత్య చెయ్యడానికి తాను మూడు కత్తులు తీసుకున్నానని, ఒక కత్తి మిస్ అయితే మరో కత్తితో ఆమెను హత్య చేసి మరో కత్తితో తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకోవాలని స్కెచ్ వేశానని విచారణలో చేతన్ పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని శివమొగ్గ సిటీలోని కోటే పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications