ఫేస్ బుక్ ఫ్రెండ్ రేప్ చేశాడు: పోలీసు కేసు
మంగళూరు: ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతితో చనువుగా ఉంటూ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
కర్ణాటకలోని మంగళూరు నగరంలో పంజిమగురు ప్రాంతంలో 26 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఈమెకు పర్వేజ్ ముషరఫ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. ఇద్దరూ దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు.

శారీరక వాంచ తీరిన తరువాత తాను పెళ్లి చేసుకోనని ఎదురుతిరిగాడు. బలవంతంగా తన మీద లైంగిక దాడి చేశాడని బాధితురాలు మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని పోలీసులకు చెప్పింది.
పర్వేజ్ ముషరఫ్ తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు యువతి మీద అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసి ఫేస్ బుక్ స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications