Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లిని రేప్ చేసి కూతురిని అలా చేశాడని ప్రజ్వల్ పై కేసు, కలకలం రేపుతున్న ఎంపీ రాసక్రీడలు!

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల ఆరోపణల కేసు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అత్యాచారం, లైంగిక వేధింపుల బాధితులు ముందుకు వచ్చి సిట్ ముందు తమ కష్టాలను వివరిస్తున్నారు, ఈ కేసులో ఎంపీ తండ్రి రేవణ్ణతో పాటు కొందరు అరెస్టు అయ్యారు. తల్లీ మీద అత్యాచారం చేసి ఆమె కూతురని లైంగిక వేధింపులకు గురి చేశాడని ప్రజ్వల్ రేవణ్ణ మీద కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

మా అమ్మపై అత్యాచారం చేసిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సిట్ ముందుకు వచ్చిన ఓ మహిళ ఫిర్యాదు చెయ్యడంతో కన్నడిగులు ఉలిక్కిపడ్డారు. ఈ దారుణ ఘటనలను ఆ మహిళ సిట్ ముందు వివరించిందని వెలుగు చూసింది. జేడీఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలు మాపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.

A case has been registered that MP Prajwal Revanna sexually assaulted mother and daughter

బెంగళూరులోని తన నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ నాలుగు, ఐదేళ్ల క్రితం తన తల్లిపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వర్గాల సమాచారం ప్రకారం బాధితురాలు లైంగిక వేధింపుల ఘటనలకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలను అందించిందని తెలిసింది. తండ్రీకొడుకుల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని బాధితురాలు సిట్ కు సమాచారం ఇచ్చింది.

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లి మొబైల్ కు వీడియో కాల్‌ చేసి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. నేను చెప్పినట్లు చెయ్యకుంటే నీతో పాటు మీ అమ్మకు ప్రాణహాని తలపెడుతానని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతనను బెదిరించాడని ఆమె ఆరోపించింది. తన తల్లి మొబైల్ ఫోన్ కు వీడియో కాల్ చేసి తనను చంపేస్తానని బెదిరించి తనతో బట్టలు విప్పించేలా చేశాడని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు ఆ మహిళ ఆరోపించింది.

ఈ విషయాన్ని ఇండియా టుడే వెల్లడించింది. ప్రజ్వల్ రేవణ్ణ మా అమ్మ ఫోన్ కు పదేపదే ఫోన్ చేసి నా బట్టలు తీసేయమని అడిగాడని, అందుకు తాను అంగీకరించకపోవడంతో నిన్ను, మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, తన బట్టలు తీసేసి వీడియో కాల్ లో మాట్లాడాలని తనను బెదిరించాడని, నేను చెప్పినట్లు చెయ్యకుంటే మీ నాన్న ఉద్యోగం పీకించేస్తానని ప్రజ్వల్ రేవణ్ణ బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.

ఈ సంఘటనల గురించి తెలుసుకున్న తరువాత మా కుటుంబం తనకు మద్దతు ఇచ్చిందని, తరువాత తాను ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు సిట్ ముందు చెప్పింది. ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లి మీద అత్యాచారం చేసి లైంగికంగా వేధించాడు. మా అమ్మను కూడా హెచ్‌డీ రేవణ్ణ లైంగికంగా వేధించాడని, మీరు సహకరించకపోతే మా నాన్న ఉద్యోగం తీసేస్తానని బెదిరించాడని, నీ కూతురిని రేప్ చేస్తానని మా అమ్మను బెదిరించాడని బాదితురాలు ఆరోపించింది.

2020 నుంచి 2021 మధ్య జరిగిన నిరంతర లైంగిక వేధింపులు మా కుటుంబాన్ని దెబ్బతీశాయని, మేము మా మొబైల్ నంబర్లను మార్చవలసి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పని చేసే మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ మహిళ సిట్ ముందు ఆరోపించింది. ప్రజ్వల్ రేవణ్ణ అతని ఇంట్లో పని చేసే మహిళలను లైగింక వేధింపులకు గురిచేసిన మాట వాస్తవమే అని, ఈ ఘటనలపై ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడారని, ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు చాలా మంది ఉన్నారని మహిళ ఆరోపించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి విదేశాలకు పారిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+