Student: యూనివర్శిటీ క్యాంపస్ హాస్టల్ లో నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమైన స్టూడెంట్, ఏం జరిగింది ?
కుటుంబ సభ్యులకు దూరంగా యూనివర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటూ బాగా చదువుకుంటున్న యువకుడు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. అయితే ఆ కాలేజ్ అబ్బాయి అనుమానాస్పద స్థితిలో నగ్నంగా శవమై కనిపించడం కలకలం రేపింది.
బెంగళూరు/ధారవాడ: కాలేజ్ లో చదువుతున్న కొడుకు మంచి ప్రయోజకుడు అయ్యి మమ్మల్లి ఉద్దరిస్తాడని అతని కుటంబ సభ్యులు అనుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా యూనివర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటూ బాగా చదువుకుంటున్న యువకుడు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. అయితే ఆ కాలేజ్ అబ్బాయి అనుమానాస్పద స్థితిలో నగ్నంగా శవమై కనిపించడం కలకలం రేపింది. కాలేజ్ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

యూనివర్శిటీ క్యాంపస్ హాస్టల్ లో ?
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని కోట్టూరుకు చెందిన రోహిత్ (22) అనే యువకుడు ధారవాడ వ్యవసాయ విశ్వవిధ్యాలయంలో చివరి సంవత్సరం పీజీ చేస్తున్నాడు. ధారవాడ విశ్వవిధ్యాలయంలో చదువుతున్న రోహిత్ అదే యూనివర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో చదువుతున్నాడు. ఇదే సంవత్సరం రోహిత్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

నెల రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు
గత నెల సెలవుల్లో రోహిత్ అతని ఇంటికి వెళ్లి కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడని తెలిసింది. కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న రోహిత్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ లో స్నేహితులతో రోహిత్ మంచితనంగా ఉంటున్నాడని తెలిసింది. రోహిత్ గురించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని అతని స్నేహితులు అంటున్నారు.

నగ్నంగా ఫ్యాన్ కు వేలాడిన కాలేజ్ అబ్బాయి
కాలేజ్ హాస్టల్ లో భోజనం చేసిన రోహిత్ హాస్టల్ లోని అతని రూమ్ లోకి వెళ్లాడు. రోహిత్ రూమ్ లో ఉంటున్న ఇద్దరు స్నేహితులు ఊరికి వెళ్లారని తెలిసింది. రోహిత్ రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో అతని ఫోన్ కు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. రోహిత్ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అతని స్నేహితులకు అనుమానం వచ్చి హాస్టల్ లోని అతని రూమ్ దగ్గరకు వెళ్లి తలుపులు కొట్టారు. అయితే రోహిత్ ఎంతసేటికి తలుపు తియ్యకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లాగి చూడగా రోహిత్ ఫ్యాన్ కు నగ్నంగా వేలాడుతూ శవమై కనిపించాడు.

అసలు ఏం జరిగింది ?
యూనివర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో కాలేజ్ అబ్బాయి రోహిత్ నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది. రోహిత చావుపై మాకు అనేక అనుమానలు ఉన్నాయని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. యూనివర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో కాలేజ్ అబ్బాయి నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం ధారవాడ యూనివర్శిటీలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications