Viral Video: అబ్బాయితో అదిరిపోయే స్టెప్పులేసిన అంటీలు.. వీడియో వైరల్..
దేశవ్యాప్తంగా వివాహాల సీజన్ జోరందుకోవడంతో, పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాగాజా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి బావ, మరదళ్లను ఆటపట్టించడం చూస్తుంటాం. డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. ఈ వీడియోలో అబ్బాయితో కలిసి ఇద్దరు డ్యాన్స్ చేశారు.

మైన్ నై నవేలీ ఆయ్
వీరు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో మొదటగా అబ్బయి వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇద్దరు మహిళలు అతనితో కలిసి స్టెప్పులేశారు. 'మైన్ నై నవేలీ ఆయ్' పాటకు వారు డ్యాన్స్ చేస్తారు. అబ్బాయి ఫార్మల్ ప్యాంట్-షర్టు ధరించి కనిపిస్తుండగా, మహిళలు సంప్రదాయ చీరల్లో కనిపిస్తారు.

44 లక్షలకు పైగా వ్యూస్
ఓ మహిళ డ్యాన్స్ మధ్యలో వెళ్లి మళ్లి వస్తుంది. వీడియో చివర్లో మరో మహిళ కూడా వీరితో కలిసి డ్యాన్స్ చేస్తారు. అంకిత్ జాంగిద్ అనే ఖాతా ద్వారా యూట్యూబ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 44 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డ్యాన్స్‌ని చూసి అక్కడున్న జనం కూడా హర్షధ్వానాలు, చప్పట్లు కొట్టారు.
వాహ్ బ్రో
వినియోగదారులు వారి కెమిస్ట్రీని ఇష్టపడ్డారు. వారి నృత్య ప్రదర్శనను అందరూ ప్రశంసించారు. "చాలా అందమైన, మనోహరమైన క్షణాలు ... అందరు నృత్యకారుల నృత్యం చాలా బాగుంది" నెటిజన్ కామెంట్ చేశాడు. "వాహ్ బ్రో, పర్ఫెక్ట్ డ్యాన్స్, క్లీన్ స్టెప్స్, స్మూత్ మూవ్స్, ఆహ్లాదకరమైన వ్యక్తీకరణలు. చాలా బాగుంది" మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications