delivery boy: చుక్కలు చూపిస్తున్న డెలవరీబాయ్, లేడీస్ కు వీడియో కాల్స్ చేసి ప్రైవేట్ పార్ట్స్ తో ?

వీడియో కాల్స్ చేస్తూ ఆమెకు అతని ప్రైవేట్ పార్ట్స్ చూపించి చిత్రహింసలకు గురి చెయ్యడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో డెలవరీబాయ్ గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

ముంబాయి/ పూణే: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఓ యువకుడు డెలవరీబాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్ లైన్ లో వస్తువులు కోనుగోలు చేస్తున్న వారికి ఇతను ఆ వస్తువులు డెలవరీ చేస్తున్నాడు. డెలవరీ బాయ్ ఎక్కువగా వస్తులు డెలవరీ ఇస్తూ ఆ కంపెనీలో కొంచం పేరు సంపాధించుకున్నాడు. ఇటీవల ఓ మహిళకు వీడియో కాల్ చేసిన యువకుడు అతని ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. పదేపదే వీడియో కాల్స్ చేస్తూ ఆమెకు ప్రైవేట్ పార్ట్స్ చూపించి చిత్రహింసలకు గురి చెయ్యడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో డెలవరీబాయ్ గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

ఈ కామర్స్ కంపెనీలో డెలవరీ బాయ్

ఈ కామర్స్ కంపెనీలో డెలవరీ బాయ్

మహారాష్ట్రలోని మలత్ జిల్లాలోని ఓ నగరంలో జ్యోతిరామ్ బాబురావ్ మన్సులే అలియాజ్ జ్యోతిరామ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జ్యోతిరామ్ డెలవరీబాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్ లైన్ లో వస్తువులు కోనుగోలు చేస్తున్న వారికి జ్యోతిరామ్ ఆ వస్తువులు డెలవరీ చేస్తున్నాడు. కంపెనీ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వస్తువులను డెలవరీ ఇస్తున్న జ్యోతిరామ్ ఆ కంపెనీలో కొంచం పేరు సంపాధించుకున్నాడు.

డెలవరీబాయ్ స్కెచ్

డెలవరీబాయ్ స్కెచ్

డెలివరీ ఇవ్వడానికి వెళ్ళే ఇళ్లల్లో మహిళలు ఉంటే వారి ఫోన్ నెంబర్లను జ్యోతిరామ్ సేకరించాడు. ఆన్ లైన్ లో వస్తువులు ఆర్డర్ చేసిన మహిళల వివరాలు తెలుసుకున్నాడు. మహిళలకు ఆర్డర్ చేసిన వస్తువులు ఇచ్చిన తరువాత జ్యోతిరామయ్ వారి వ్యక్తిగత సెల్ ఫోన్‌ నెంబర్లు నోట్ చేసుకుంటూ వచ్చాడు. మహిళల సెల్ ఫోన్ నెంబర్లు కంపెనీ ఫోన్ లో కాకుండా అతని పర్సనల్ మొబైల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు.

మహిళకు ఫోన్ చేసి ఏం అడిగాడంటే ?

మహిళకు ఫోన్ చేసి ఏం అడిగాడంటే ?

మహిళల ఫోన్ నెంబర్లు రికార్డు చేసుకున్న తరువాత వాట్సాప్‌ తో పాటు ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ సైట్‌ల ద్వారా అసభ్యకర చిత్రాలను మహిళలకు పంపుతున్న జ్యోతిరామ్ వారిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఈ సందర్భంలో మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళకు అశ్లీల చిత్రాలు పంపించిన జ్యోతిరామ్ ఆమెకు వీడియో కాల్స్ చేస్తూ ఆమె ప్రైవేట్ భాగాలను చూపించాలని వేధించాడు.

25 మంది లేడీస్ కి చిత్రహింసలు పెట్టిన డెలవరీబాయ్

25 మంది లేడీస్ కి చిత్రహింసలు పెట్టిన డెలవరీబాయ్

డెలవరీ బాయ్ జ్యోతిరామ్ చిత్రహింసలు ఎక్కువ కావడంతో బాధిత వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్న డెలవరీబాయ్ జ్యోతిరామ్‌ను అరెస్టు చేశారు. జ్యోతిరామ్ సెల్‌ఫోన్‌ను పోలీసులు పరిశీలించి షాక్ అయ్యారు. పోలీసుల విచారణలో జ్యోతిరామ్ ఇప్పటి వరకు 25 మందికి పైగా మహిళలను ఇలాగే వేధింపులకు పాల్పడ్డాడని తేలింది. జ్యోతిరామ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+