సినిమాల్లో 'లక్' లేకుంటే..: బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్
ముంబై: సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఓ యువతి ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటుంది. సినిమా రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తైతే, విజయం సొంతం చేసుకోవడం, దానిని కొనసాగించడం మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఇవి కావాలంటే అదృష్టం కావాలంటారు.
ఆ 'లక్' అందకపోతే జీవితం ఎటు వెళ్తుందో తెలియదు. దానికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ. ఆమెకు సినిమాలంటే ప్రాణం. దీంతో ముంబైకి వచ్చి సినిమాల్లో నటించాలనుకుంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. చివరకు, ఒక భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.

అయితే, ఆ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం విజయం సాధించకపోవడంతో ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు రాలేదు. దీంతో, కుంగిపోయిన మిథాలీ శర్మ తిరిగి ఇంటికి కూడా వెళ్లలేకపోయింది.
సినిమాల్లో నిలదొక్కుకోలేని తాను తన తల్లిదండ్రులకు ముఖం చూపించలేకపోయింది. వేరే పనుల వల్ల జీవనోపాధి పొందేందుకు కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. సినిమా తప్ప తనకు వేరే పనేమి తెలియదనుకున్న మిథాలీ జీవనం ప్రస్తుతం దుర్భరంగా మారింది.
ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుని బతుకుతోంది. మానసికంగా కూడా ఆమె పరిస్థితి సరిగ్గా లేదు. ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను పోలీసులు గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. అక్కడ మిథాలీ శర్మ గురించిన విషయాలు పోలీసులకు తెలిసింది. హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకున్న మిథాలీ.. ఒకే ఒక్క ఫెయిల్యూర్ కారణంగా బిచ్చగత్తెగా మారింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications