అమ్మాయిని రేప్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫేమస్ సింగర్ !

గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఓ యువకుడు చిన్న వయసులోనే సింగర్ అయ్యాడు. ఇప్పటికే మంచి మంచి హిట్ సాంగ్స్ పాడిన ఆ సింగర్ సొంతంగా యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. నివాసం ఉంటున్న ఏరియాకి చెందిన ఓ మైనర్ అమ్మాయిని నమ్మించి హోటల్ కు పిలుచుకుని వెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. హోటల్ లో అమ్మాయి మీద రేప్ చేసే సమయంలో సీక్రేట్ గా తీసిన ఫోటోలను ఆ సింగర్ చాలాకాలం తరువాత సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి.

మైనర్ బాలికపై అత్యాచారం చేసి అభ్యంతరకర చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు భోజ్‌పురి గాయకుడిని గురువారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు బీహార్‌కు చెందిన అభిషేక్ (21) అని పోలీసులు అన్నారు. భోజ్‌పురి గాయకుడిగా బాబుల్ బిహారీగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ ఇప్పటికే భోజ్ పురిలో మంచిమంచి హిట్ సాంగ్స్ పాడాడని పోలీసులు అన్నారు.

 singer

బాబుల్ బిహారి అలియాస్ అభిషేక్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకున్నాడని, అతని యూట్యూబ్ చానల్ లో 27,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ లోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న 13 ఏళ్ల బాలికను నిందితుడు బాబుల్ బిహారి రెండేళ్ల క్రితం పరిచయం చేసుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. మైనర్ అమ్మాయితో సింగర్ బబూల్ బిహారి స్నేహం చేశాడు.

ఆమెతో స్నేహం దుర్వినియోగం చేసిన సింగర్ ఏడాది క్రితం గురుగ్రామ్ లోని ఓ హోటల్ గదిలోకి ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్లాడు. అదే హోటల్ లో మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఆ సందర్బంలో భోజ్ పురి సింగర్ బాబుల్ బిహారి మైనర్ అమ్మాయికి తెలీకుండా అత్యాచారం చేస్తూ ఫొటోలు తీశాడని తెలిసింది.

అలాగే ఘటన తర్వాత భయపడిపోయిన మైనర్ అమ్మాయి నిందితుడు బబూల్ బిహారికి దూరంగా ఉండిపోయింది. భోజ్ పురి సింగర్ బబూల్ బిహారి తన మీద అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి ఎవ్వరికీ చెప్పలేదు. తన గురించి మైనర్ అమ్మాయి ఎవ్వరికి చెప్పలేదని అనుకున్న సింగర్ బబూల్ బిహారి ఇటీవల రెచ్చిపోయాడు.

abuse
అయితే నిందితుడు బుబూల్ బిహారి కొన్ని రోజుల క్రితం మైనర్ అమ్మాయి అసభ్యకర చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ చిత్రాలను చూసిన బాధితురాలి కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిందని, తన మీద అత్యాచారం జరిగిందని అమ్మాయి అంగీకరించిందని పోలీసు అధికారులు అంటున్నారు.

అనంతరం బాధితురాలి కుటుంబీకులు ఆమెను బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత ఆమె ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ సెక్టార్ 14 పోలీస్ స్టేషన్‌లో నిందితుడు సింగర్ బబూల్ బిహారి మీద మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడని పోక్సో చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) దుర్విరియోం చేశాడనే సెక్షల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొద్ది గంటల్లోనే నిందితుడు బబూల్ బిహారిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సుభాష్ బోకెన్ స్థానిక మీడియాకు తెలిపారు. సింగర్ బబూల్ బిహారిని గురుగ్రామ్ సిటీ కోర్టులో హాజరుపరిచామని, శుక్రవారం అతన్ని, జ్యుడిషియల్ కస్టడీకి పంపించామని పోలీసులు తెలిపారు. భోజ్ పురి సింగర్ గా బబూల్ బిహారి మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి స్థాయికి వస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో కామాంధుడు ఫోక్సో చట్టం కింద అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+