Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్న కూతుర్ని చూసి పెద్ద కూతురు పాడుపని ? అర్దరాత్రి అడ్డంగా నరికేసిన తండ్రి !

చిక్కబళ్లాపురం/బెంగళూరు: అందమైన కుటుంబం. తండ్రి, తల్లి మరియు ముగ్గురు కుమార్తె (daughter) ఉంటున్నారు. మొదటి కూతురు పెళ్లి (marriage) చేసుకుని భర్త ఇంట్లో హ్యాపీగా ఉంటోంది. మిగతా ఇద్దరు కుమార్తెలు ఇంట్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు. అయితే రాత్రి రెండో కూతురు నిద్రిస్తున్న సమయంలో కూతురిని కన్న తండ్రి హత్య చేశాడు.

అంతే కాకుండా కూతురిని (daughter)హత్య చేసిన తండ్రికి ఎలాంటి భాధలేదు. కూతుర్ని చంపేసిన తరువాత హత్యకు ఉపయోగించిన కొడవలి ఎత్తుకున్న తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. సొంత కూతురి కథను ముగించిన తండ్రి కనికరం లేకుండా పోలీసుల ముందు నిలబడి నా కూతురిని (daughter) నేను చంపేశాను, మీరు వెళ్లి శవాన్ని తెచ్చుకోండి అంటూ చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

A father brutally murdered his own daughter who was hanging out with her boyfriend near Bengaluru.
కూతురిని హత్య చేసిన వ్యక్తి పేరు మంజునాథ్ అలియాస్ మంజు. కన్న తండ్రి చేతిలో హత్యకు గురి అవుతానని అతని కూతురు (daughter) అస్సలు ఊహించలేదని పోలీసులు అంటున్నారు. కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురికావాలని శత్రువులు కూడా కోరుకోరని పోలీసులు అంటున్నారు. అయితే సరిగ్గ తండ్రి చేతిలోనే కూతురు (daughter) హత్యకు గురైయ్యిందని పోలీసులు అంటున్నారు.

కూతుర్ని హత్య చేశాను అంటే మొదట మేముకూడా మంజునాథ్ మాటలు నమ్మలేదని, తరువాత ఆరా తీస్తే ఆ ఇద్దరు కూతుళ్లు (daughter) తండ్రిని ఎంత హింసించారో అర్థం అయ్యిందని పోలీసులు అంటున్నారు. కూతుర్ల మీద విపరీతమైన మమకారం పెంచుకున్న తండ్రి చివరికి వారిని చంపేస్థాయికి వెళ్లేలా చేసిందని పోలీసు అధికారులు తెలిపారు.

కర్ణాటకలోని (Karnataka) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)-కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపురం (chikkaballapur) జిల్లాలోని విశ్వనాథపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంజునాథ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మంజునాథ్ కు ముగ్గురు కుమార్తెలు (daughter) ఉన్నారు. మంజునాథ్ పెద్ద కుమార్తె వేరే కులం యువకుడిని (love)ప్రేమించింది. అయితే విషయం తెలుసుకున్న మంజునాథ్ కూతురికి బుద్దిమాటలు చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమెకు బ్రైన్ వాష్ చేశాడు.

మంజునాథ్ అతని పెద్ద కుమార్తెను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (anantapur) జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి (marriage) చేశాడు. భర్తతో కాపురం చేస్తున్న మంజునాథ్ కుమార్తె అత్తారింటిలో ఉంటున్నది. రెండో కుమార్తె కవన కూడా వేరే అబ్బాయిని ప్రేమించింది. రెండో కూతురు (daughter) కవన కూడా ప్రేమలలో పడటంతో మంజునాథ్ హడలిపోయాడు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఊరికి చెందిన ఓ అబ్బాయితో ఇటీవల కవన నిశ్చితార్థం జరిపించాడు.

రెండో కూతురు కవనకు బ్రైన్ వాష్ చేసి మేము చెప్పిన చోట పెళ్లి చేసుకోవాలని కూతురికి నచ్చచెప్పిన మంజునాథ్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తరువాత కూడా కవన ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడపడితే అక్కడ తిరుగుతోంది. నిశ్చితార్థం (marriage)చేసుకున్న చెల్లెలు కవన ప్రియుడితో తిరుగుతోందని తెలుసుకున్న ఆమె అక్క (sister)అనంతపురంలోని (anantapur) భర్త ఇంటి నుంచి సొంత ఊరు చేరుకుని ఆమె పాత ప్రియుడితో (boyfriend) తిరగడం మొదలుపెట్టింది.

పెళ్లి చేసుకున్న అమ్మాయి, నిశ్చితార్థం జరిగిన కవన వాళ్ల ప్రియులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరు మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ చూసినా మంజునాథ్ ఇద్దరు కుమార్తెల (daughter) గురించి చర్చ మొదలైయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మంజునాథ్ ఊరిలో తన పరువుపోయిందని ఆవేదనతో రగిలిపోయాడు. తన రెండో కుమార్తె కవన కారణంగా పెద్ద కూతురు (daughter) కూడా బరితెగించిందని మంజునాథ్ రగిలిపోయాడు.

రాత్రి భార్య, రెండో కూతురు కవనతో కలిసి భోజం చేసిన మంజునాథ్ నిద్రపోయాడు. అర్దరాత్రి (night) దాటిన తరువాత మంజునాథ్ కొడవలి తీసుకుని నిద్రపోతున్న రెండో కూతురు కవనను నరికి చంపేశాడు. మరుసటి రోజు వేకువ జామున 6 గంటల సమయంలో విశ్వనాథ్ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంజునాథ్ నా కూతురు కవనను చంపేశానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

A father brutally murdered his own daughter who was hanging out with her boyfriend near Bengaluru.

కవన ఆమె గాలి తిరుగుడు తిరగడమే కాకుండా సొంత అక్కను (sister) కూడా చెడగొడుతోందని కోపంతో రగిలిపోయి ఆమెను చంపేశానని మంజునాథ్, అంగీకరించాడని, కేసు విచారణలో ఉందని చిక్కబళ్లాపురం పోలీసులు తెలిపారు. మొత్తం మీద నిశ్చితార్థం జరిగిన తరువాత కూడా కన్నకూతురు (daughter) ప్రియుడితో (boyfriend) తిరుగుతోందని ఆమెను తండ్రి మంజునాథ్ హత్య (muder) చెయ్యడం చిక్కబళ్లాపురంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+