భార్య మీద కోపంతో కూతురిని రేప్ చేసిన తండ్రి, గర్బవతి కావడంతో ?, గతంలో ఏం చేశాడంటే ?
భార్యతో కొన్ని సంవత్సరాలు సక్రమంగా కాపురం చేసిన భర్త ఓ కూతురుకు తండ్రి అయ్యాడు. క్రిమినల్ కార్యకలాపాలు చేస్తూ నిత్యం జైలుకు వెళ్లి బయటకు వస్తున్న భర్త తీరుతో అతని భార్య విసిగిపోయింది. ఇదే సమయంలో అత్యాచారం కేసులో భర్త అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. భార్య అతని కూతురిని అత్తారింటిలో వదిలేసి వెళ్లిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన కిరాతకుడు కన్న కూతరి మీద కన్ను వేశాడు.
మైనర్ కూతురుపై తండ్రి పదేపదే అత్యాచారం చేసిన ఘటన ముంబాయి నగరంలో చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ముంబాయిలోని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశామని ముంబాయి పోలీసు అధికారులు తెలిపారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం బాధితురాలు ముంబాయిలో ఆమె తండ్రి, అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటున్నది.

ముంబాయిలోని సబర్బన్ ప్రాంతంలో నివసిస్తున్న అమ్మాయికి ఇటీవల ఎక్కువగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాదితురాలిని బాంద్రాలోని బాబా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించగా గర్భవతి అని తేలింది. మైనర్ అమ్మాయి గర్బవతి అని తెలుసుకున్న వైద్యులు హడలిపోయి వెంటనే బాంద్రా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆసుపత్రికి వెళ్లి ఎలా గర్బవతి అయ్యావు, నిన్ను ఎవరు మోసం చేశారు అని పోలీసులు ఆ అమ్మాయిని ప్రశ్నించారు.
తన తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేశాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక వెల్లడించింది. బాలిక ఇచ్చిన సమాచారంతో హడలిపోయిన పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేశారు. బాలిక తండ్రికి గతంలో దొంగతనం, అత్యాచారం కేసుల్లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడని, అతనికి గతంలో నేరచరిత్ర ఉందని ముంబాయి పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు.
జైలు జీవితం గడిపిన బాలిక తండ్రి 2023 నవంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని, అప్పటి నుంచి ప్రతిరోజూ బాలికపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసు అధికారి తెలిపారు. అతని నేర ప్రవృత్తి కారణంగా అతని భార్య అతనితో నివసించడం లేదని, కూతురిని అమ్మమ్మ దగ్గర వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో మైనర్ బాలిక, నిందితుడి తల్లి మాత్రమే నివసిస్తున్నట్లు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications