నాలుగు నెలల క్రితం పెళ్లి, భర్త అక్రమ సంబంధం, రైలు కింద దూకిన లేడీ రిపోర్టర్
ఐదేళ్ల ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న మహిళా జర్నలిస్టు వివాహం జరిగి ఆరు నెలలు కూడా కాకుండా ఆమె జీవితాన్ని ముగించింది. అమ్మా నన్ను క్షమించు అంటూ చివరి క్షణంలో ఏడుస్తూ చివరి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళా జర్నలిస్టు రైలు కిందపడి ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని ఓ ప్రముఖ వెబ్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న ముధుమిత పరిదా అలియాస్ మధుమిత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ యువ జర్నలిస్టు పెళ్లయిన నాలుగు నెలల్లోనే విషాదకరంగా ఆమె జీవితానికి ముగింపు పలకడం కలకలం రేపుతోంంది. అమ్మ నన్ను క్షమించండి, నేను కొన్ని నెలల క్రితం తీసుకున్న నా దూకుడు నిర్ణయానికి నేను చింతిస్తున్నాను. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఈ ప్రపంచంలో ఇలాంటి కపట మనుషులు ఉన్నారని నాకు తెలియదు అని మధుమిత విలపిస్తూ వీడియో తీశారు.

ఐదేళ్లు ప్రేమించి, అందరినీ పెళ్లికి ఒప్పించి ఇద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. నేను మార్చి 1వ తేదీన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాను. కానీ నేను ప్రేమిస్తున్న నా భాగస్వామి నన్ను మోసం చేశాడు. అతనికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. రాత్రంతా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతను రాత్రి12 గంటలకు కూడా నా స్నేహితురాళ్ళతో, అతని స్నేహితురాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
ఈ విషయం తెలియగానే తాను ఆయన్ను నిలదీశానని మధుమిత వీడియోలో చెప్పింది. ఈ సమయంలో నీతో కలిసి జీవించలేనని, నువ్వు మీ ఇంటికి వెళ్లిపోవాలని నా భర్త తనతో కచ్చితంగా చెప్పాడు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మారిపోయాడంటూ మధుమిత ఏడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. చివరి వీడియోను పోస్ట్ చేసిన మధుమిత భువనేశ్వర్ లోని బాపూజీ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్‌పై దూకి ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మధుమిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భువనేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మార్చి 1వ తేదీన మధుమిత తన బాయ్‌ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అయ్యాక ఆమె ప్రియుడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని మధుమితకు తెలిసింది.
ఐదేళ్లుగా ప్రేమించిన మధుమిత ఎన్నో సవాళ్లు, పెద్దల వ్యతిరేకతల మధ్య ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అయితే గత ఐదేళ్లుగా తనతోనే కాకుండా వేరొకరితో కూడా తన భర్తకు అక్రమ సంబంధం ఉందని మధుమిత ఆరోపించింది. ఇదే విషయంలో నెల రోజుల నుంచి మధుమితకు ఆమె భర్తకు గొడవలు జరుగుతున్నాయని మధుమిత స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications