తండ్రి లోన్ కట్టలేదని కూతుర్ని కిడ్నాప్ చేసిన ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ !
చెన్నై: తండ్రి రుణం చెల్లించలేదన్న కారణంతో లోన్ రికవరీ ఏజెంట్ అతని 11 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన 27 ఏళ్ల ఏజెంట్ కిడ్నాప్ చేశాడని పోలీసులు అన్నారు. శుక్రవారం 11 ఏళ్ల బాలికను ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ కిడ్నాప్ చేశాడు. గత కొన్ని నెలలుగా రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో తన కుమార్తెను ఇంటి నుంచి ఎత్తుకెళ్లినట్లు ఆమె తండ్రి ఆరోపించాడు.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తమిళనాడులోని కీరనూర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో 32 ఏళ్ల వనతు రాజా అనే రోజువారీ కూలీ రూ.50,000 అప్పు తీసుకున్నాడు. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాజా కొన్ని నెలలుగా ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.

ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ విఘ్నేష్ బకాయిలు వసూలు చేసేందుకు తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలోని రాజా నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో రాజా 11 ఏళ్ల కుమార్తె ఇంట్లో ఉంది. బాలిక తండ్రి రాజా గురించి అడగగా అతను లేడని ఆ అమ్మాయి ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ విఘ్నేష్ చెప్పింది. లేదు మీ నాన్న రాజా ఇంట్లోనే దాక్కున్నాడని విఘ్నేష్ అక్కడ గొడవ చేశాడని తెలిసింది.
విఘ్నేష్ రాజా కుమార్తెను కిడ్నాప్ చేసి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కూతురు అదృశ్యమైన విషయం తెలుసుకున్న రాజా వెంటనే కిరనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చిన్నారి ఆచూకీ తెలుసుకుని ఫైనాన్స్ కంపెనీ కార్యాలయానికి చేరుకున్నారు.
తండ్రి అప్పు చెల్లించలేదని ఆమె మైనర్ కూతురిని కిడ్నాప్ చేసిన విఘ్నేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి రుణం చెల్లించలేదని అతని కూతుర్ని ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది కిడ్నాప్ చెయ్యడం కలకలం రేపింది. తమిళనాడులో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నా ఫైనాన్స్ కంపెనీల యాజమాన్యంకు భయపడి చాలా మంది ఫిర్యాదులు చెయ్యడం లేదని ఓ పోలీసు అధికారి అంటున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications