Pay Roll: భార్య పేరును పేరోల్‍లో చేర్చి.. రూ.4 కోట్లు నొక్కేసిన ఉద్యోగి..

ఓ ఉద్యోగి పని చేస్తున్న సంస్థనే మోసం చేశాడు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి చాలా చాకచక్యంగా ప్లాన్‌ చేసి కోట్లు కొల్లగొట్టాడు. మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మాజీ ఫైనాన్స్ మేనేజర్, రాధాబల్లవ్ నాథ్ కంపెనీ పేరోల్ విధానాన్ని తెలివిగా తారుమారు చేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు.

మోసపూరితంగా తన నిరుద్యోగి భార్యను పేరోల్‌లో చేర్చాడు. ఆమెకు పదేళ్లకు పైగా రెగ్యులర్ జీతం దాదాపు రూ.4 కోట్లు వచ్చేలా చూసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో తమ రికార్డులు తారుమారు అయ్యాయని కంపెనీ గుర్తించడంతో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన సంస్థ నిర్వహించిన అంతర్గత విచారణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు.

payrollfraud

గత వారం ఈ విషయంపై అధికారిక దర్యాప్తు ప్రారంభించడానికి కంపెనీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ విచారణ చేస్తున్నారు. ManpowerGroup అనేక కంపెనీలకు సిబ్బంది. నియామక సేవలను అందిస్తుంది. రాధాబల్లవ్ నాథ్ అనే వ్యక్తి 2008లో ఈ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)గా చేరాడు. తర్వ మేనేజర్ (ఫైనాన్స్)గా పదోన్నతి పొందాడు.

తన భార్యకు పని చేయకుండా ఆదాయం వచ్చే మార్గాన్ని కనుకొన్నాడు. ఒక ప్రణాళికను రూపొందించాడు. కంపెనీలో కఠినమైన డేటా సెక్యూరిటీ ఉన్నప్పటికీ రాధాబల్లవ్ నాత్ తెలివిగా వ్యవహరించి తన భార్య పేరుతో నెలానెల జీతం తీసుకున్నాడు. నెలవారీ పేరోల్, రీయింబర్స్‌మెంట్ డేటాకు కేవలం ముగ్గురు అధికారులకు మాత్రమే చెక్ చేయగలరు. వారిలో డైరెక్టర్ (మానవ వనరులు), చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (CHRO), మేనేజర్ రాధాబల్లవ్ నాథ్ ఉన్నారు.

fraud2

పేరోల్ వెండర్, HR, ఫైనాన్స్, విభాగాల మధ్య రాధాబల్లవ్ నాథ్ మధ్యవర్తిగా ఉండేవాడు. అతను నెలవారీ చెల్లింపు రిజిస్టర్‌ను సిద్ధం చేసి పేరోల్ వెండర్‌కు పంపేవాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, రాజీనామా చేసిన వారు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల హాజర్ వివరాలు సేకరించి జాబితా తయారు చేసేవాడు. జాబితాను హెచ్ ఆర్ డైరెక్టర్, అక్కడ నుంచి సీహెచ్ ఆర్వోకు పంపేవాడు. వారి అఫ్రువల్ వచ్చిన తర్వాత వెండర్ కు పంపిస్తుండేవాడు.

అప్పుడు వెండర్లు ఉద్యోగుల ఖాతాల్లో జీతం జమ చేస్తుండేవారు. బ్యాంకుకు పంపే ముందు, నాథ్ రికార్డులను తారుమారు చేసి, కంపెనీ క్లెయిమ్ ప్రకారం తన భార్య పేరును చేర్చాడు. బ్యాంక్ పోర్టల్‌లో తారుమారు చేసిన పేరోల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి నాథ్ మేనేజర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేసిన మరో ఉద్యోగి కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించినట్లు కంపెనీ అంతర్గత విచారణలో వెల్లడైంది. ఫైల్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత, అతను దానిని సిస్టమ్ నుంచి నాథ్ తొలగించేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+